212.. 212.. మ్యాచ్ మొదట టై..
ఆపై సూపర్ ఓవర్.. 2 జట్లు 16 పరుగులు చేశాయి .. పెరిగిన ఉత్కంఠ..
రెండో సూపర్ ఓవర్ ఇండియా 11/2.. ఆఫ్ఘానిస్థాన్ 1/2 ..నరాల తెగే ఉత్కంఠకు ముగింపు.. భారత్ థ్రిల్లింగ్ విన్
మూడో టీ20లో పోరాడి ఓడిన అఫ్ఘానిస్థాన్
సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్
రోహిత్ 5 వ T20 సెంచరీ తో అత్యధిక శతకాల రికార్డ్. మాక్స్ వెల్, సూర్యకుమార్ లను అధిగమించాడు
![Ind Vs AFG 3rd T20 Super & Super : అసలైన T20 అంటే ఇదే.. 2వ సూపర్ ఓవర్‌లో గెలిచిన భారత్!](https://samacharnow.in/wp-content/uploads/2024/01/Ind-Vs-AFG-3rd-T20.webp)
భారత్-అఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆఖరి టీ20 సూపర్ మ్యాచ్ ఫ్యాన్స్‌కు ఫుల్ మజాను ఉత్కంఠ ను పంచింది..పరుగుల వరద పారిన పోరులో విజేతను తేల్చేందుకు ఏకంగా రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది..అయితే రెండో సూపర్ ఓవర్లో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుత బౌలింగ్‌తో రెండు వికెట్లు పడగొట్టి టీమిండియాకు ఉత్కంఠ విజయం అందించాడు. సూపర్ ఓవర్లో 2 వికెట్లు పతనమైతే ఆలౌట్ అయినట్టు లెక్క మరి..
Ind Vs AFG 3rd T20: మొదటి సూపర్ ఓవర్
Ball | అఫ్ఘానిస్థాన్ చేసిన పరుగులు | భారత్ చేసిన పరుగులు |
1 | 1 మరియు వికెట్ | 1 లెగ్ బై |
2 | 1 | 1 |
3 | 4 | 6 |
4 | 1 | 6 |
5 | 6 | 1 మరియు వికెట్ |
6 | 3 బైస్ | 1 |
Total | 16/1 | 16/1 |
Ind Vs AFG 3rd T20: రెండవ సూపర్ ఓవర్
Ball | భారత్ చేసిన పరుగులు | అఫ్ఘానిస్థాన్ చేసిన పరుగులు |
1 | 6 | వికెట్ |
2 | 4 | 1 |
3 | 1 | వికెట్ |
4 | వికెట్ | |
5 | వికెట్ | |
6 | ||
Total | 11/2 | 1/2 |
భారత్ – అఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించేలా జరిగిన 3rd T 20 భారత్ ‘రెండో సూపర్ ఓవర్’లో గెలుపొందింది. ఇరు జట్ల బ్యాటర్లు పోటాపోటీగా పరుగులు చేయడంతో ఈ మ్యాచ్ రెండు సూపర్ ఓవర్ల వరకు వెళ్లింది. చివరికి రెండో సూపర్ ఓవర్‌లో భారత్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓ దశలో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్‌ను రోహిత్ శర్మ (121), రింకూ సింగ్ (69) ఆదుకున్నారు. అబేధ్యమైన ఐదో వికెట్‌కు 190 పరుగులు జోడించారు.
భారీ ఛేదనలో అఫ్ఘానిస్థాన్ ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం భారత బౌలర్లను బెంబేలెత్తిస్తూ, తొలి వికెట్‌కు ఏకంగా 93 పరుగులు జోడించారు. స్పిన్నర్ కుల్దీప్ బౌలింగ్‌లో సుందర్ పట్టిన సూపర్ క్యాచ్‌తో గుర్బాజ్ అవుట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆపై రెండు వికెట్లను వెంట వెంటనే చేజార్చుకున్నా..చివరికి 212 పరుగులు చేసి మ్యాచ్ టై చేయడంతో సూపర్ ఓవర్ల కు వెళ్లాల్సి వచ్చింది.