Ind vs Eng 1st Test Day2: 175 పరుగుల ఆధిక్యంలో భారత్.. సత్తా చాటిన రాహుల్ & జడ్డు..

Ind vs Eng 1st Test Day2: 2వ రోజు ఆట ముగిసాక ఇంగ్లాండ్ పై 175 పరుగుల ఆధిక్యంలో భారత్..టీమిండియా ట్రాక్ తప్పుతుందనుకున్న మ్యాచ్ ని జడేజా ఎలా కాపాడాడు?
Share the news
Ind vs Eng 1st Test Day2: 175 పరుగుల ఆధిక్యంలో భారత్.. సత్తా చాటిన రాహుల్ & జడ్డు..

Ind vs Eng 1st Test Day2

రెండవ రోజు ఆటలో రాహుల్ మరియు జడేజా తమ బాటింగ్ తో ఇండియా ని మంచి పోసిషన్ లో ఉంచారు. దాంతో ఆట ముగిసే సరికి 110 ఓవర్ల లో IND 421/7 పరుగులు చేసి మ్యాచ్ ను శాసించే స్థితి లో వుంది.

Ind vs Eng 1st Test Day2: session1

ఇంగ్లండ్ నిర్దేశించిన 246 పరుగులకు సమాధానంగా 1వ రోజు 23 ఓవర్లలో 119/1 స్కోరు చేసిన సంగతి తెలిసిందే. 2 వరోజు ఆట మొదలు పెట్టిన భారత్ 24వ ఓవర్లో యశస్వి జైస్వాల్ (80) జో రూట్, శుభ్‌మన్ గిల్ (23) 35వ ఓవర్‌లో టామ్ హార్ట్‌లీ చేతిలో వికెట్ కోల్పోయింది. వేగంగా పరుగులు చేస్తూ సెంచరీ సాధించేలా కనిపించిన జైస్వాల్‌ తొలి ఓవర్‌లో నాలుగో బంతికే వెనుదిరిగాడు. స్పిన్నర్‌ రూట్‌తో రెండో రోజు బౌలింగ్‌ను ఆరంభించిన కెప్టెన్‌ స్టోక్స్‌ ఫలితం సాధించాడు. భారీ షాట్‌కు వెళ్లిన జైస్వాల్‌.. రూట్‌కే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. అదే ఓవర్‌లో రాహుల్‌ క్యాచ్‌ను కీపర్‌ ఫోక్స్‌ అందుకున్నట్లయితే మ్యాచ్ వేరే విధంగా ఉండేది. అనంతరం హార్ట్‌లీ ఓవర్‌లో వరుస ఫోర్లతో ఆకట్టుకున్నాడు. కాసేపటికే గిల్‌ (23) అనవసర షాట్‌కు వెళ్లి వికెట్‌ సమర్పించుకున్నాడు. రాహుల్‌ మరియు శ్రేయస్ ఓపిగ్గా ఆడి వికెట్ పడకుండా మొదటి సెషన్ ముగించారు.

See also  Ind Vs Eng 3rd Test: జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఆరంభంలో విజృంభణ.. 150 దాటిన బెన్ డకెట్..

Ind vs Eng 1st Test Day2: session2

ఇక రెండవ సెషన్ ఆరంభంలోనే శ్రేయాస్‌ వికెట్‌ను స్పిన్నర్‌ రెహాన్‌ పడగొట్టడంతో నాలుగో వికెట్‌కు రాహుల్‌-శ్రేయాస్‌ 64 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ ఆ తర్వాత రాహుల్‌కు జడేజా జత కలవడంతో పరుగుల వేగం తగ్గలేదు. రాహుల్ ఫోర్లు, సిక్సర్లతో 57 వ ఓవర్లో జట్టు స్కోరును 250కి చేర్చాడు. అటు జడ్డూ కూడా భారీ షాట్లతో చెలరేగాడు. అయితే ఆత్మవిశ్వాసంతో ఆడుతున్న రాహుల్‌ను హార్ట్‌లీ దెబ్బతీశాడు. ఐదో వికెట్‌కు ఈ ఇద్దరు 65 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత జడేజా, భరత్‌ జాగ్రత్తగా ఆడడంతో టీ విరామానికి ముందు 11 ఓవర్లలో ఒక్క ఫోర్‌ మాత్రమే నమోదైంది.

Ind vs Eng 1st Test Day2: session3

ఆఖరి సెషన్‌లో జడ్డూతో కలిసి భరత్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇద్దరూ అనవసర షాట్లకు వెళ్లకుండా ఆచితూచి ఆడారు. అటు జడ్డూ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా.. భరత్‌ కూడా కెరీర్‌లో తొలి హాఫ్‌ సెంచరీ చేస్తాడనిపించింది. కానీ జో రూట్‌.. భరత్‌ను అవుట్‌ చేయడంతో ఆరో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యానికి చెక్‌ పడింది. ఆ వెంటనే మిస్ అండర్ స్టాండింగ్ వల్ల అశ్విన్‌ (1) రనౌట్‌ అయినా.. జడేజాతో కలిసి అక్షర్‌ తన చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆఖరి ఓవర్‌లో అక్షర్‌ వరుసగా 4,6,4తో అదరగొట్టడంతో ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 63 పరుగులు జత చేరాయి.

See also  Chiranjeevi Support: సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కు మద్దతు తెలిపిన చిరంజీవి.. దాంతో పాటు కూటమికి కూడా..

ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ, జో రూట్ చెరో రెండు వికెట్లు తీయగా, జాక్ లీచ్, రెహాన్ అహ్మద్ చెరో వికెట్ తీశారు.

Also Read News

Scroll to Top