IND vs SA 2nd Test in Cape Town.. 23 Wickets in one Day: రెండో రోజే ఫలితం తేలనుందా?

IND vs SA 2nd Test in Cape Town.. 23 Wickets in one Day: రెండో రోజే ఫలితం తేలనుందా? ఇండియా రెండో టెస్ట్ మాంచి రసవత్తరంగా మారింది. లాస్ట్ 6 వికెట్లు సున్నా పరుగులకే కోల్పోవడం టీమిండియా చేసిన పెద్ద పొరపాటు. కానీ ఇప్పటికి టీమిండియాకే గెలుపు అవకాశాలు వున్నాయి
Share the news
IND vs SA 2nd Test in Cape Town.. 23 Wickets in one Day: రెండో రోజే ఫలితం తేలనుందా?

IND vs SA 2nd Test in Cape Town

సౌత్ ఆఫ్రికా – ఇండియా రెండో టెస్ట్ (IND vs SA 2nd Test) మాంచి రసవత్తరంగా మారింది. మహమ్మద్ సిరాజుద్దీన్ తన కెరీర్ బెస్ట్ సాధించాడు. అరివీర బయంకరమైన బౌలింగ్ చేసి ఆరు వికెట్లు అందిపుచ్చుకున్నాడు. దాంతో 55 పరుగులకే సౌత్ ఆఫ్రికాను ఆలౌట్ చేశారు. ఇందులో సిరాజుద్దీన్ 6 వికెట్లు తీయగా, Bumra రెండు, ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీసుకున్నారు.

ఆ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా మొదట్లో బాగానే ఆడుతున్నదని అనిపించింది కానీ, 153/5 వికెట్లతో మంచి స్థితిలో కనిపించినా అదే స్కోర్ దగ్గర ఆలౌట్ అయ్యింది. దాంతో తొలి ఇన్నింగ్స్ లో 98 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ఆఫ్రికా ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది.

ఒకేరోజు 20 కన్నా ఎక్కువ వికెట్లు పడడం ఇది 35 వ సారి. ముగ్గురు Batesman ఒకే రోజు రెండు సార్లు అవుటవడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ఆఫ్రికా ఒక రకంగా తప్పుడు నిర్ణయం తీసుకోగా, Team India 153 పరుగుల స్కోర్ మీద 5 వికెట్లు కోల్పోవడం పెద్ద తప్పిదం అని చెప్పాలి. 46 పరుగుల వ్యక్తిగత స్కోర్ తో Virat Kohli అత్యధిక స్కోర్ చేయగా, 6 గురు బ్యాట్స్మన్ లు సున్నాకే అవుట్ అయ్యారు. ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే, 7 గురు సున్నా కే పరిమితం అయ్యారు. ముఖేష్ సున్నాతో నాటవుట్ గా వున్నాడు.

See also  India Vs England 4th Test: ఇంగ్లండ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో సూపర్బ్ విక్టరీ.. సిరీస్‌ కైవసం..

IND vs SA 2nd Test in Cape Town మరి కొన్ని విశేషాలు

టెస్టు క్రికెట్‌లో స్కోరు చేయకుండా ఆరు వికెట్లు కోల్పోయిన తొలి జట్టుగా Team India

122 ఏళ్ల లో తొలి రోజు అత్యధికంతా వికెట్ల పడ్డ టెస్ట్ ఇదే

55, ఇది టెస్ట్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాకు ఏడవ అత్యల్ప స్కోరు.

టెస్టు క్రికెట్‌లో భారత్‌పై ఆడిన ఏ జట్టుకైనా దక్షిణాఫ్రికా చేసిన 55 అత్యల్ప స్కోరు.

అంతకు ముందు 2021లో వాంఖడేలో న్యూజిలాండ్ చేసిన 62 అత్యల్ప స్కోరు.

Cape Town ఒకే రోజులో 23 Wickets… ఎలా పడినాయో చూడండి …

-By ముత్తోజు సత్యనారాయణ, Sr. Journalist

Also Read News

Scroll to Top