Most expensive player in IPL Auction 2024: మిచెల్ స్టార్క్, రూ.24.75 కోట్ల ధరతో ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రికార్డు!

Share the news
Most expensive player in IPL Auction 2024: మిచెల్ స్టార్క్, రూ.24.75 కోట్ల ధరతో ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రికార్డు!

Most expensive player in IPL Auction 2024

ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్(Mitchell Starc), IPL History లోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ స్టార్క్ కోసం పోటీ పడ్డాయి. చివరికి కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ను రికార్డు ధరకు కొనుగోలు చేసింది. వేలంలో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం కళ్లు చెదిరే ధర రూ.24.75 కోట్లు వెచ్చించి మరీ కేకేఆర్ స్టార్క్ ను సొంతం చేసుకుంది

మొదట ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి పటిష్ట జట్లు ఆసీస్ పేసర్ స్టార్క్ కోసం బిడ్డింగ్ మొదలుపెట్టాయి. ఓ మోస్తరు ధర వచ్చాక గుజరాత్ టైటాన్స్ రంగంలోకి దిగింది. తరువాత కేకేఆర్ వేలాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీతో పోటి పడి కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధరకు ఆసీస్ పేసర్ స్టార్క్ ను తీసుకుంది.

See also  National Sports Awards 2023: సాత్విక్-చిరాగ్‌కు ఖేల్ రత్న, క్రికెటర్ షమీ, ఆర్చర్స్ శీతల్ & అదితితో సహా 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు

కొన్ని గంటల్లోనే Most expensive player in IPL Auction 2024 కమిన్స్ రికార్డు బద్దలు..

ఈ సారి కూడా ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆసీస్ ఆటగాళ్లకు భారీ ధర పలుకుతోంది. మినీ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడుగా పాట్ కమిన్స్‌ (Pat Cummins) నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఇతని కోసం పోటీ పడ్డాయి. మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రావడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మొత్తం రూ 20.50 కోట్లు పెట్టి మరీ కమిన్స్ ను కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ కొనుగోలు చేసిన తరువాత మిచెల్ స్టార్క్ రేసులోకి వచ్చాడు. అతన్ని రికార్డు స్థాయిలో రూ.24.75 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ పేసర్ ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇరవై కోట్ల ధర దాటడం ఇదే తొలిసారి. కాగా, వాళ్ళు ఇద్దరు కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్లే.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top