SA vs IND 2nd T20 Match Highlights: రింకూ, సూర్య పోరాటం వృథా- రెండో టీ20లో దక్షిణ ఆఫ్రికా విజయం

SA vs IND 2nd T20 Match Highlights: రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణ ఆఫ్రికా విజయం సాధించింది. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 180పరుగులు చేసింది. దక్షిణ ఆఫ్రికా ఆ స్కోర్‌ను 13.5 ఓవర్లలోనే ఛేజ్ చేసింది.
Share the news
SA vs IND 2nd T20 Match Highlights: రింకూ, సూర్య పోరాటం వృథా- రెండో టీ20లో దక్షిణ ఆఫ్రికా విజయం

SA vs IND 2nd T20 Match Highlights: రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణ ఆఫ్రికా విజయం సాధించింది. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 180పరుగులు చేసింది. దక్షిణ ఆఫ్రికా ఆ స్కోర్‌ను 13.5 ఓవర్లలోనే ఛేజ్ చేసింది.

మొదటి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవటంతో ఎంతో ఆసక్తి నెలకొన్న రెండో T20 మ్యాచ్ లోనూ వర్షమే భారత్ పాలిట విలన్ గా మారింది. సౌతాఫ్రికాలోని గబేహాలో భారత్, దక్షిణ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో అన్ని విభాగాల్లోనూ సత్తా చాటిన సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది.

SA vs IND 2nd T20 Match Highlights

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ దెబ్బ పడింది. ఖాతా తెరవకుండానే ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, శుభ్ మాన్ గిల్ డక్ అవుట్‌గా వెనుదిరిగారు. ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ను తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నారు. తిలక్ నాలుగుఫోర్లు ఓసిక్స్ తో 29పరుగులు చేస్తే..కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి టీమ్ ను నిలబెట్టాడు. తిలక్ అవుటయ్యాక వచ్చిన రింకూసింగ్ ప్రారంభంలో నెమ్మదిగా ఆడినా చివరకు వచ్చేప్పటికి రెచ్చిపోయాడు. 9 ఫోర్లు 2 సిక్సర్లతో 39 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

See also  IND VS SA 3rd ODI: కుమ్మేసిన కుర్రోళ్ళు.. టీమిండియాదే ODI సిరీస్

19.3 ఓవర్లలో భారత్ 180పరుగులు చేసిన టైమ్‌లో వర్షం మొదలైంది. దీంతో భారత్ స్కోరు అక్కడే నిలిచిపోయింది. ఈ పిచ్‌పై 180 పరుగులు భారీస్కోరే అయినా వర్షం కారణంగా పిచ్ పరిస్థితులు మారిపోయాయి. బంతి బ్యాట్ మీదకు తేలికగా రావటంతో దక్షిణ ఆఫ్రికా పని ఈజీ అయిపోయింది.

డక్ వర్త్ లూయిస్ ప్రకారం సఫారీలకు 15 ఓవర్లలో 152 పరుగులుగా డిసైడ్ చేయగా, మొదటి మూడు ఓవర్లలోనే దాదాపు మ్యాచ్ ను వాళ్లవైపు తిప్పేసుకున్నారు దక్షిణాఫ్రికా బ్యాటర్లు. ఓపెనర్ రెజా హెండ్రిక్స్ 49 పరుగులు, కెప్టెన్ మార్క్రమ్ 30 పరుగులు చేశారు. భారత బౌలర్లు అర్ష్ దీప్, ముకేశ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

అడపాదడపా భారత్ బౌలర్లు వికెట్లు తీసినా 13.5ఓవర్లలోనే 154పరుగులు చేసింది సౌతాఫ్రికా. పొదుపుగా బౌలింగ్ చేసిన సౌతాఫ్రికా బౌలర్ తబ్రీజ్ షంసికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ సిరీస్ ను భారత్ ఓడిపోకూడదంటే గురువారం జరిగే ఆఖరి మూడో టీ20 మ్యాచ్ ను కచ్చితంగా గెలిచి తీరాలి.

Also Read News

Scroll to Top