Akash Deep: తొలి టెస్ట్.. తొలి రోజు.. తొలి సెషన్.. తన తొలి 6 ఓవర్లలోనే మూడు వికెట్లు తీసిన ఆకాశ్ దీప్ ఎవరు?
Akash Deep: చాలామంది భారతీయుల్లానే చిన్నప్పటి నుంచి ఆకాశ్ దీప్ కల క్రికెటర్ కావాలనే. కానీ తండ్రికి ఇష్టం లేకపోవడంతో బాల్యంలో క్రికెట్ ఆడటం కుదర్లేదు. ఉద్యోగం కోసం వేరే ఊరెళ్లిన ఆకాశ్.. తన చుట్టాలబ్బాయితో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. తర్వాత కుటుంబంలో విషాదాల కారణంగా మూడేళ్లపాటు ఆటకు దూరం. ,మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టి.. రంజీల్లోకి, ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఏకంగా టీమిండియా తరఫున టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు.