Vehicle registration

వెనుక‌బ‌డిన ప్రాంతాల గ్రాంటు విడుద‌ల‌కు స‌హ‌క‌రించండి…నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ సుమ‌న్ భేరీకి CM Revanth విన‌తి

న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంట‌నే విడుద‌ల‌య్యేలా స‌హ‌క‌రించాల‌ని నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ సుమ‌న్ భేరీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) విజ్ఞ‌ప్తి చేశారు. న్యూఢిల్లీలో నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం క‌లిశారు. హైద‌రాబాద్‌లో మూసీ న‌ది రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధికి అవ‌స‌ర‌మైన నిధులు ఇప్పించాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ప్రపంచ‌బ్యాంకు ఎయిడ్ విడుద‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగు నీటి స‌ర‌ఫ‌రాకు అవ‌స‌ర‌మైన నిధులతో పాటు రాష్ట్రంలో త‌మ ప్ర‌భుత్వం వైద్య‌,ఆరోగ్య‌, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్క‌ర‌ణ‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్‌కు ముఖ్య‌మంత్రి విజ్ఙ‌ప్తి చేశారు.

వెనుక‌బ‌డిన ప్రాంతాల గ్రాంటు విడుద‌ల‌కు స‌హ‌క‌రించండి…నీతీఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ సుమ‌న్ భేరీకి CM Revanth విన‌తి Read More »

సమాచార పౌరసంబంధాల శాఖ నూతన ప్రత్యేక కమిషనర్‌(Commissioner)గా శ్రీ ఎం హనుమంత రావు

సమాచార పౌరసంబంధాల శాఖ నూతన ప్రత్యేక కమిషనర్‌(Commissioner)గా శ్రీ ఎం హనుమంత రావు సోమవారం మాసాబ్ ట్యాంక్ సమాచార్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. శ్రీ అశోక్ రెడ్డి హార్టికల్చర్ డైరెక్టర్ గా బదిలీ పై వెళ్లడంతో ఆయన స్థానంలో కమిషనర్‌గా శ్రీ ఎం హనుమంత రావు నియమితులయ్యారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన కమిషనర్‌ ఆ శాఖ అధికారులతో సమావేశమై శాఖాపరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో ప్రచారం చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు అందుకు అణుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. సచివాలయంలో I&PR ప్రత్యేక కార్యదర్శిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎఫ్‌డీసీ కిషోర్‌బాబు, అడిషనల్‌ డైరెక్టర్‌ నాగయ్య కాంబ్లే, జాయింట్‌ డైరెక్టర్లు జగన్‌, వెంకట్‌ రమణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్‌, సీఐఈ రాధాకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

సమాచార పౌరసంబంధాల శాఖ నూతన ప్రత్యేక కమిషనర్‌(Commissioner)గా శ్రీ ఎం హనుమంత రావు Read More »

Reason behind quality liquor in AP again? మళ్లీ రాష్ట్రంలో క్వాలిటీ మద్యం ప్రవేశపెట్టడం వెనుక కారణం..?

మళ్లీ ఏపీలో Quality liquor? అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ మళ్లీ ఏపీ ప్రభుత్వం పాత బ్రాండ్ల మద్యం(quality liquor) అందుబాటులోకి వచ్చింది.మద్యం షాపులు, బార్లలో అమ్మకాలు మొదలయ్యాయి. పాత బ్రాండ్లు రావడంతో మద్యం అమ్మకాలు పెరిగాయి.దీంతో ఎన్నికల సమయంలో వ్యాపారం బాగా జరుగుతుందని వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం రోజుకు రూ.75 కోట్ల వ్యాపారం జరుగుతుండగా, పాత బ్రాండ్ల రాకతో రోజుకు మరో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు వ్యాపారం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Reason behind quality liquor in AP again? మళ్లీ రాష్ట్రంలో క్వాలిటీ మద్యం ప్రవేశపెట్టడం వెనుక కారణం..? Read More »

తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ల(Telangana Vehicle Registration) లో ఇక ‘టీఎస్’ కాదు… ‘టీజీ’

తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ల(Telangana Vehicle Registration) లో ఇక ‘టీఎస్’ కాదు… ‘టీజీ’నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశంపలు కీలక నిర్ణయాలకు ఆమోదంరాష్ట్ర చిహ్నంలోనూ మార్పులుతెలంగాణలో కులగణనకు నిర్ణయం

తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ల(Telangana Vehicle Registration) లో ఇక ‘టీఎస్’ కాదు… ‘టీజీ’ Read More »

Scroll to Top