Amit Shah in Hyderabad: రాష్ట్ర బీజేపీ కీలక నేతలకు అమిత్ షా వార్నింగ్!

Share the news
Amit Shah in Hyderabad: రాష్ట్ర బీజేపీ కీలక నేతలకు అమిత్ షా వార్నింగ్!

Amit Shah in Hyderabad

వచ్చే ఏడాది ప్రథమార్థం లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సమర శంఖారావం పూరించేందుకు నేడు హైద్రాబాద్ ప్రత్యేక పర్యటనకు వచ్చిన అమిత్ షా. నంగంలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్ లో భా.జ.పా కీలక నేతలతో సమావేశం అయ్యారు. నేతల మధ్య విభేదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయామని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు అమిత్ షా (Amit Shah) వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

లోక్ సభ ఎన్నికల్లో విభేదాలు పక్కన పెట్టి అంతా సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలని, 10 నుండి 15 సీట్లు సాధించేలా కృషి చేయాలని ప్రజల్లో తిరగాలని ,కేంద్ర ప్రభుత్వ పనితీరు, పథకాల అమలు, అభివృద్ధి, మోడీ నాయకత్వ ప్రతిభను వివరించాలని రాష్ట్ర నాయుకులకు సూచించినట్లు సమాచారం. ‘సిట్టింగ్ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తాం. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం ఇస్తాం. ఈసారి అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తాం.’ అని పేర్కొన్నారు. అంతకు ముందు ఆయనకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ స్వాగతం పలికారు.

See also  TSPSC Group2 Exam Postponed: ముచ్చటగా 3 వ సారి వాయిదా పడ్డ TSPSC Group2 Exam. త్వరలో కొత్త తేదీలు వెల్లడి!

Amit Shah in Hyderabad: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా

Amit Shah in Hyderabad

అనంతరం చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.


@ సురేష్ కశ్యప్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top