BJP bring Bandi Sanjay back? తెలంగాణలో జరిగిన తప్పును బీజేపీ సరిదిద్దుకోనుందా ?

BJP bring Bandi Sanjay back! లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి తిరిగి పుంజుకుని, మెరుగైన ఫలితాలు సాధించాలి అంటే బండిని అధ్యక్షుడిగా తిరిగి నియమించక తప్పదు.
Share the news
BJP bring Bandi Sanjay back

BJP bring Bandi Sanjay back!

Telangana ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు వలన వచ్చిన ప్రతికూల ప్రభావాన్ని గుర్తించిన బిజెపి, తెలంగాణలో పార్టీ ప్రయోజనం కోసం తన నిర్ణయాన్ని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉందా? Yes, బిజెపి నాయకత్వం తెలంగాణలో తమ వ్యూహం మార్చుకొనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. బిజెపి హైకమాండ్ రాష్ట్ర బిజెపి చీఫ్‌గా బండి సంజయ్‌ను తిరిగి నియమించడానికి అవకాశం ఉందని సమాచారం. అది కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ లోపే ఉండవచ్చు.

2020 మార్చిలో తెలంగాణలో బిజెపి ఉనికి చాలా తక్కువగా ఉన్నప్పుడు సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడి పాత్రను స్వీకరించారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి చెంది, ప్రజల్లో ఆదరణ పొంది, పార్టీ కార్యకర్తల్లో విశ్వాసాన్ని పెంచింది. దాంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు కూడా.

అయితే ఈ ఏడాది జూలైలో అసాధారణ రీతిలో సంజయ్‌ను పక్కనపెట్టి కిషన్‌రెడ్డిని తెలంగాణ అధ్యక్షుడిగా BJP హైకమాండ్ నియమించింది. ఈ నిర్ణయం రాష్ట్ర బిజెపిలో గందరగోళానికి దారితీసింది, కొంత మంది పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు మరియు కొంతమంది సభ్యులు Party ఫిరాయించారు. అసలు ఈ మార్పే congress కు ఊపిరి పోసింది. అప్పటి వరకు BRS తో ఢీ అంటే ఢీ అన్న బీజేపీ కాడి పడేసి BRS కు తెరవెనుక సపోర్ట్ చేస్తుందని జనం భావించారు కూడా. దాంతోనే ప్రభత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ కాష్ చేసుకోగలిగింది. అధికారం లోకి రాగలిగింది. అదే బండి సంజయ్ ఉండి ఉంటే?

See also  Bharat Ratna to PV Narasimha Rao: ఆర్ధిక సంస్కరణల మూలపురుషుడు పివి నరసింహారావు కు భారతరత్న!

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకున్నప్పటికీ, గత ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ బీజేపీ క్యాడర్ లో అసంతృప్తి నెలకొని వుంది. సంజయ్ బండి అధ్యక్షుడిగా ఉండి ఉంటే, రాష్ట్రంలో బీజేపీ 20కి పైగా సీట్లు సాధించి ఉండేదని పార్టీ అంతర్గత వర్గాలు సూచిస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా బీజేపీ కొత్త వ్యూహం పన్నుతోంది. సంజయ్ బండిని తెలంగాణ అధ్యక్షుడిగా తిరిగి నియమించే సూచనలు ఉన్నాయి, ఇది రాష్ట్రంలో బిజెపికి తిరిగి పుంజుకోవడానికి అవకాశం అందిస్తుంది.

Also Read News

Scroll to Top