CM Review Meeting on Abhaya Hastham applications: ప్రజాపాలన దరకాస్తులపై నేడు (సోమవారం ) సి.ఎం. సమీక్ష సమావేశం..

Share the news
CM Review Meeting on Abhaya Hastham applications: ప్రజాపాలన దరకాస్తులపై నేడు (సోమవారం ) సి.ఎం. సమీక్ష సమావేశం..

గత నెల 26 తేదీ నుండి ఈనెల 6 వతేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలన(Prajapalana) లో అందిన దారకాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సోమవారంనాడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లతో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, సి.జి.జి డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమీషనర్ తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రజాపాలన పై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్-సైట్ prajapalana.telangaana.gov.in ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

ప్రజాపాలనలో మొత్తం 1,05,91,636 Abhaya Hastham దరఖాస్తులు

ప్రజాపాలన కార్యక్రమం జరిగిన పదిరోజుల్లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో ఐదు గ్యారేటీలకు సంబంధించి 1,05,91,636 దరకాస్తులు కాగా, ఇతర అభ్యర్ధనలకు సంబంధించి 19 ,92 ,747 ఉన్నాయి. రాష్ట్రంలోని 16,392 గ్రామ పంచాయితీల, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించగా, ఈ గ్రామ సభల్లో 1,11,46,293 మంది పాల్గొన్నారు. ఈ ప్రజాపాలనలో మొత్తం 3,714 అధికార బృందాలు పాల్గొని దరఖాస్తుల స్వీకరణకు 44,568 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రజాపాలన సజావుగా జరిగేందుకు పది ఉమ్మడి జిల్లాలు, జీహెచ్ఎంసీ(GHMC) లోని అయిదు జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణాధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ దరకాస్తులనన్నింటినీ జనవరి 17 వ తేదీ లోగా డేటా ఎంట్రీ ని పూర్తి చేయాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించడం జరిగింది.

See also  Praja Palana: దరఖాస్తుల వెల్లువ, రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజే 7,46,414 అభయహస్తం దరఖాస్తులు.

జిల్లాల వారీగా అందిన Abhaya Hastham & ఇతర దరఖాస్తుల వివరాలు (లక్షల్లో )

స్పెషల్ కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ చే జారీ చేయనైనది.

Abhaya Hastham
Abhaya Hastham 1

By రాంబాబు.C

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top