Construction University: కన్ స్ట్రక్షన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Construction University: ఈరోజు న్యాక్ లో జరిగిన సుదీర్ఘ సమావేశంలో కనస్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, జిల్లాల్లో స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, న్యాక్ భూముల్ని కాపాడటం, నిరుద్యోగులకు ఉపాధికల్పనకు నిర్వహించాల్సిన కోర్సుల గురించి విస్తృతంగా చర్చించారు.
Share the news
    Construction University: కన్ స్ట్రక్షన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

    గత ప్రభుత్వం పేపర్లలో ఫోటోలు – టీవిల్లో స్టేట్మెంట్లు తప్పితే ఎక్కడా నిజాల్ని వెల్లడించలేదన్నారు మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈరోజు న్యాక్ లో జరిగిన ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారిగారితో కలిసి పాల్గొన్న మంత్రి.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడా చట్టబద్ధమైన పాలన సాగలేదని ఆరోపించారు రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

    గత ప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసి లక్షల మంది యువత జీవితాలతో ఆడుకుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు పెట్టుబడుల పేరిట మీడియా ప్రచారం తప్పా.. ఒక్కటి కార్యరూపం దాల్చలేదన్నారు. దుబాయ్ కు చెందిన నాఫ్కో కంపెనీ న్యాక్ తో ఒప్పందం చేసుకొని ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేస్తుందని చెప్పి ప్రచారం చేసుకున్నారని తీరా ఇవ్వాల చూస్తే అసలు ఆ కంపెనీ ఊసేలేదని న్యాక్ సిబ్బంది చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.

    See also  Praja Palana: దరఖాస్తుల వెల్లువ, రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజే 7,46,414 అభయహస్తం దరఖాస్తులు.

    ప్రతీ సంవత్సరం కనీసం నాలుగుసార్లు జరపాల్సిన న్యాక్ (National academy of construction) గవర్నింగ్ బాడీ సమావేశాల్ని 10 సంవత్సరాల్లో కేవలం ఒక్కసారి మాత్రమే జరపడం అత్యంత బాధాకరం అన్నారు. రాబోయే రోజుల్లో 9 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో, మండలాల వారిగా నిరుద్యోగులకి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి.. ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని ఆయన తెలిపారు. న్యాక్ కు సంబంధించిన భూముల్ని పొందిన కొన్ని సంస్థలు పూర్తిగా కమర్షియల్ కార్యకలపాలకు వినియోగిస్తూ న్యాక్ ఆదాయానికి పెద్దయెత్తున్న గండికొడుతున్నాయని వాటిని సరిచేస్తామని ఆయన తెలిపారు.

    Construction University

    జరిగిన సుదీర్ఘ సమావేశంలో Construction University ఏర్పాటు చేయడం, జిల్లాల్లో స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, న్యాక్ భూముల్ని కాపాడటం, నిరుద్యోగులకు ఉపాధికల్పనకు నిర్వహించాల్సిన కోర్సుల గురించి విస్తృతంగా చర్చించారు. ఇదే సమావేశంలో ఆర్ & బి ఎంప్లాయిస్ అసోసియేషన్, న్యాక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

    See also  Shanthi Swaroop: దూరదర్శన్ లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి శాంతి స్వరూప్ ఇక లేరు!

    బిల్డర్స్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన మంత్రి :
    న్యాక్ సముదాయంలోని బిల్డర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన అభినందనసభలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడిన బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి.. పది సంవత్సరాలు పోరాడిన కానీ తీరని కాంట్రాక్టర్ల సమస్యను కేవలం 48 గంటల్లో జీవో ఆర్టీ నెంబర్ 25 ద్వారా వచ్చేలా చేసి బిల్డర్ల సమస్యలను పరిష్కరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు.

    -By C. Rambabu

    Also Read News

    Scroll to Top