Courageous Mother and Daughter: తల్లి కూతుర్ల తెగింపు.. దుండగులను ఉతికి ఆరేసిన వైనం.. See Video!

Share the news
Courageous Mother and Daughter: తల్లి కూతుర్ల తెగింపు.. దుండగులను ఉతికి ఆరేసిన వైనం.. See Video!

తల్లి కూతుర్ల ధైర్యం(Courageous Mother and Daughter)

ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు ఆగంతకుల్లో ఒకరు మహిళ తలపై తుపాకీ గురిపెట్టాడు. మరో ఆగంతుకుడు ఆమె కుమార్తెను కత్తితో బెదిరించాడు. ‘ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు, విలువైన వస్తువులివ్వండి.. లేదంటే కాల్చిపారేస్తాం.. పొడిచేస్తాం’ అని అరిచారు. ఇంకోళ్ళయితే బెదిరే వాళ్లేమో. కానీ ఈ తల్లీకూతుళ్లు(Courageous Mother and Daughter) బెదరలేదు సరికదా ఆ ఇద్దరిపై ఒక్కసారిగా రెచ్చిపోయి తిరగబడ్డారు. హడలెత్తిపోయిన ఆగంతకుల్లో ఒకరు అక్కడి నుంచి పరారవ్వగా.. మరొకరిని ఆ తల్లీకూతుళ్లు స్థానికుల సాయంతో పట్టుకున్నారు. బేగంపేట(Begumpet) పోలీస్ స్టేషన్ రసూల్ పుర(Rasul pura) జైన్ కాలనీ(Jain Colony) లో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కాలనీలోని ప్లాట్‌ నంబర్‌ 5లో ఆర్కే జైన్‌ కుటుంబం నివసిస్తోంది.

పోలీసుల వివరాల ప్రకారం.. కాలనీలోని ప్లాట్‌ నంబర్‌ 5లో ఆర్కే జైన్‌ కుటుంబం నివసిస్తోంది. గురువారం మధ్యాహ్నం 1.30 సమయంలో ఇంట్లోని వంట గదిలో పనిమనిషి, మరో గదిలో ఆర్కే జైన్‌ భార్య, కుమార్తె ఉన్నారు. కొరియర్‌ అంటూ ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. రాగానే తుపాకీని పని మనిషికి చూపిస్తూ బెదిరించాడు. పనిమనిషి పెద్దగా అరవడంతో జైన్‌ భార్య, ఆమె కుమార్తె బయటకొచ్చారు. ఇంతలో మరో ఆగంతుకుడు కత్తి చూపిస్తూ వారిని బెదిరించాడు. ఇంట్లో ఉన్న బంగారు నగలు, డబ్బులు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని, తమ దగ్గర వున్న ఆయుధాలను చూపిస్తూ భయభ్రాంతులకు గురి చేశారు.

See also  Shankhabrata Bagchi: ఏపీ ఇంఛార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ

అయితే, కత్తి పట్టుకుని ఇంట్లోకి వచ్చిన ఆంగతుకుడిని జైన్‌ భార్య గుర్తు పట్టి ప్రేమ్‌చంద్‌ నువ్వా? ఎందుకొచ్చావు? అని పెద్దగా అరిచి అతడిపై తిరగపడింది. ఈలోపు వంటగదిలో గన్‌ తో ఉన్న వ్యక్తిపై తల్లీ కుమార్తెలు తిరగబడటంతో అతను వారిని బెదిరిస్తూ బయటకొచ్చాడు. అయినా.. వారు అతడిని కొడుతూ పట్టుకునేందుకు యత్నించగా పారిపాయాడు. ఇంతలో కత్తి పట్టుకుని బెదిరించిన వ్యక్తి బయటకు రావడంతో మహిళల స్థానికుల సహాయంతో అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఇద్దరిలో ప్రేమ్‌చంద్‌ అనే వ్యక్తి గతంలో ఆర్కే జైన్‌ ఇంట్లోనే పనిచేశాడని పోలీసులు గుర్తించారు. మరో అగంతకుడిని వరంగల్‌ జిల్లా ఖాజీపేట రైల్వే స్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక ఈ సంఘటన లో తల్లి కూతుర్ల ధైర్యం (Courageous Mother and Daughter) చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top