Data Entry of Abhayahastam Applications: ఈనెల 17 వరకు అభయహస్తం దరకాస్తుల డాటా ఎంట్రీ పూర్తి – సి.ఎస్

Share the news
Data Entry of Abhayahastam Applications:  ఈనెల 17 వరకు అభయహస్తం  దరకాస్తుల డాటా ఎంట్రీ పూర్తి – సి.ఎస్

ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం (Abhayahastam) దరఖాస్తుల డాటా ఎంట్రీ లను ఈనెల 17 వతేదీ వరకు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన నిర్వహణ, దారకాస్తుల డాటా ఎంట్రీ లపై జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గామపంచాయితీలు, మున్సిపల్ వార్డుల్లో నిర్వహిస్తున్న గ్రామ సభలను ఏవిధమైన ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తుండడం పట్ల జిల్లా కలెక్టర్లను సి.ఎస్ అభినందించారు. ఈనెల 6 వతేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. మండల రెవిన్యూ అధికారులు, మండల డెవలప్ మెంట్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ డాటా ఎంట్రీ చేపట్టాలని, ప్రజాపాలన కార్యక్రమం సూపర్వైజరీ అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలని తెలిపారు.

Abhayahastam Data Entry

Abhayahastam డాటా ఎంట్రీ చేపట్టేందుకుగాను జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర స్థాయిలో ట్రెయినీ అఫ్ ట్రైనర్ (TOT ) లకు 4 వ తేదీన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ TOT లు జిల్లా స్థాయిలో డాటా ఎంట్రీ ఏవిధంగా చేయాలన్న దానిపై 5 వ తేదీన శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఈనెల 5 వ తేదీ నుండి 17 వ తేదీ వరకు అభయహస్తం దరకాస్తుల డాటా ఎంట్రీ పూర్తి చేయాలని, ఈ డాటా ఎంట్రీ సందర్బంగా, దరకాస్తుదారుల వివరాల నమోదులో ఆధార్ నెంబర్, వైట్ రేషన్ కార్డు లను ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకుగాను, జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న డీ.టి.పి ఆపరేటర్ల సేవలను ఉపయోగించుకోవాలని, అవసరమైతే ప్రయివేటు ఆపరేటర్లను హైర్ చేసుకోవాలని సి.ఎస్ సూచించారు. నిన్నటి వరకు దాదాపు 57 లక్షల దారకాస్తులు అందాయని తెలిపారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినందున, దరకాస్తు ఇవ్వని వారు, మరోసారి తిరిగి దారకాస్తులు అందచేయవచ్చని తెలియ చేశారు.

See also  BJP bring Bandi Sanjay back? తెలంగాణలో జరిగిన తప్పును బీజేపీ సరిదిద్దుకోనుందా ?

ఈ టెలీ కాన్ఫరెన్స్ లో రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, జీహెచ్ ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్,పంచాయితీ రాజ్ కమీషనర్ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.

– By రాంబాబు. Ch

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top