
Fire Accident in Film Nagar
ఫిలింనగర్(Film Nagar): ఫిలింనగర్ పరిధి లోని షేక్‌పేట ద్వారకామయి నగర్‌లో మెయిన్ రోడ్డు వద్ద కరెంటు స్తంభానికి ఉన్న వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుని మంటలు ఎగసిపడుతున్నాయి. కరెంటు వైర్లు మెయిన్ రోడ్డు పక్కనే ఉండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు విద్యుత్ అధికారులకు తెలియజేయడంతో సుమారు రెండు గంటల పాటు ఆ ప్రాంతంలో కరెంటు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. స్థానిక ప్రజలు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
-By VVA Prasad