Gaddar Jayanti: గద్దర్ జయంతి రోజున ఆయన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయనిచ్చిన ఒక ఇంటర్వూ చూద్దామా!

Share the news
Gaddar Jayanti: గద్దర్ జయంతి రోజున ఆయన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయనిచ్చిన ఒక ఇంటర్వూ చూద్దామా!

Gaddar Jayanti

గుమ్మడి విఠల్ రావు అంటే ఎవరమూ గుర్తు పట్టం కానీ గద్దర్ అన్నపేరు వింటే మాత్రం మనలో వైబ్రేషన్స్ వస్తాయి. బ్రిటిషువారికి వ్యతిరేకంగా పోరాడిన గదర్ పార్టీని తన కలం,గళం పేరుగా సొంతం చేసుకున్న గద్దర్ 75వ జయంతి(Gaddar Jayanti) నేడు..1949లో జనవరి 31వ తేదీన మెదక్ జిల్లా తూప్రాన్ లో ఒక దళిత కుటుంబంలో జన్మించారు. తన పాటకు ప్రధాన కారణం తల్లి పాడటం చిన్నతనంలో విని నేర్చుకున్నవే అన్నారు ఈ ఇంటర్వ్యూ లో. 2023 ఆగస్టు 6న ఈ లోకాన్ని వీడారు. చివరి రోజుల్లో ఒక సాధారణ పౌరుడిగా లక్డీకాపూల్ లోని ఒక మెస్ లో ఆయన లంచ్ చేస్తుండేవారు. అక్కడ రికార్డు చేసినదే ఈ ఇంటర్వూ.

ఆ పాటే ఆయన ఆయుధమయింది. దర్శకుడు బి.నర్సింగరావు ఆయనలోని ప్రతిభ గుర్తించి ప్రోత్సహించారు. అలా మా భూమిలో బండి యాదగిరి రచించిన “బండెనక బండి కట్టి” పాట తో అందరికీ సుపరిచితలయారు. జననాట్యమండలి ద్వారా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చేవారు.ఆయన మొదటి ఆల్బమ్ పేరు గద్దర్. అదే ఆయన పేరయిపోయింది.

See also  YCP Manifesto 2024: మేడిపండు లాంటి మేనిఫెస్టో రిలీజ్ చేసిన వైసిపి!

ఒరే రిక్షా చిత్రం లోని “మల్లెపూవుకు పందిరవోలె” అన్నపాటకు, జైబోలో తెలంగాణ చిత్రం లోని “పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా” అన్నపాటకు నంది పురస్కారాలు లభించాయి. సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఆ ప్రాంత ప్రజలకు అండగా నిలిచేవారాయన. పీపుల్స్ వార్ పార్టీ లో కొనసాగారు. గజ్జకట్టి ఆయన పాడే పాట ప్రజలను ఉర్రూతలూగించేది.

-By C. Rambabu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top