Hyderabad is Best for Industries: పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రాంతం

Share the news
Hyderabad is Best for Industries: పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రాంతం

Hyderabad is Best for Industries

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్(Hyderabad) చాలా అనువైన ప్రాంతం అని, పెట్టుబడులకు తమ ప్రభుత్వం సరళీకృతమైన విధానం ప్రవేశపెడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు(Duddilla Sridhar babu) తెలిపారు. బుధవారం మాదాపూర్ లోని ఐటీసీ కోహినూర్ లో జరిగిన టెలిపర్ ఫార్మెన్స్ ఇంప్రెసివ్ ఎక్స్ పీరియన్స్ సమ్మిట్ లో మంత్రి పాల్గొని ప్రసంగించారు.

1990వ దశకంలో పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్(Hyderabad) లో ఐటీ ఇండస్ట్రీ కి అంకురార్పణ చేశారని, తర్వాత ఒక పార్టీ, మధ్యలో మళ్ళీ కాంగ్రెస్, 2014 లో ఇంకో పార్టీ, ఇప్పుడు మళ్ళీ తమ ప్రభుత్వం అధికారంలో ఉందని, అయినా ఐటీ, ఇండస్ట్రీ గ్రోత్ కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

టెలి పర్ ఫార్మెన్స్ గ్రూప్(Teleperformance group) ఫౌండర్ డానియల్ జులియన్, సీఈఓ అనీష్ ముక్కర్ ను ఇండియాకు వచ్చి ఇండస్ట్రీ స్థాపనకు హైదరాబాద్ ను ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేశినట్టు మంత్రి తెలిపారు. హైదరాబాద్ లో అనుకూల వాతావరణం, మానవ వనరులు, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పుష్కలంగా ఉన్నాయి..రాష్ట్రంలో 165 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి.. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కు ప్లాన్ చేస్తున్నాం.. ఐఎస్బీ తరహాలో ఇది స్కిల్డ్ మ్యాన్ పవర్ అందిస్తుంది.. టాటా, మహీంద్ర కంపెనీలు స్కిల్ వర్సిటీ స్థాపనకు ముందుకు వచ్చాయి..
రాష్ట్రంలోని గ్రామాల్లోనూ కుటుంబానికి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉన్నారు.

See also  UPI services: నేటినుంచి శ్రీలంక మరియు మారిషస్‌లలో UPI సేవలు.. ఇక అక్కడ కూడా PhonePe..

హైదరాబాద్ దేశానికి మధ్యలో ఉంది.. ఇక్కడి నుంచి ఏ మెట్రోపాలిటన్ సిటీకి అయిన రెండు గంటల్లో వెళ్లొచ్చు.. ఇక్కడ భూకంపాలు రావు, ప్రకృతి విపత్తుల ప్రమాదం లేదు.. హైదరాబాద్ బెస్ట్ లివబుల్ సిటీ. మా ప్రభుత్వం టూరిజంపైనా ప్రత్యేక దృష్టి పెట్టింది.. టూరిజం గ్రోత్ 20 శాతం పెంచాలని టార్గెట్ పెట్టుమున్నాం..

రేపటి నుంచి బడ్జెట్ సెషన్ నిర్వహిస్తున్నాం, ఐటీ, ఇండస్ట్రీ, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పాలసీలు రూపొందిస్తున్నాం. జూన్ లో హైదరాబాద్ లో ఆర్టిఫిసీయల్ ఇంటలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏ ఐ కంపెనీలను సమ్మిట్ కు ఆహ్వానిస్తున్నాము. హైదరాబాద్ ను ఏఐ టెక్నాలాజీకి హెడ్ క్వార్టర్స్ చేయాలన్నదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాము.

-By C. Rambabu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top