Malla Reddy: మల్లా రెడ్డి మళ్లీ పార్టీ మారుతుండా?

Share the news
Malla Reddy: మల్లా రెడ్డి మళ్లీ పార్టీ మారుతుండా?

Malla Reddy మళ్లీ పార్టీ మారుతుండా?

మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి(Malla Reddy) మళ్ళీ పార్టీ మారుతుండా? ఆయన BRS ను వీడటం ఖాయమైనట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారక తప్పదని సహచర ఎమ్మెల్యేలతో ఆయన స్వయంగా చెప్పినట్లు సమాచారం.

మల్కాజిగిరి పార్లమెంట్‌ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్‌ఎస్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు ఎన్నికల్లో సహకరించాలన్న ఎజెండాతో ఆదివారం మల్లారెడ్డి(Malla Reddy) నివాసంలో ఎమ్మెల్యేల సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన వ్యాపారపరంగా కొన్ని సమస్యలున్నాయి. వాటి పరిష్కారం కోసం రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని అన్నారని తెలిసింది. తాను పార్టీ మారతాను అని, ఏ పార్టీలో చేరుతానన్న దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయన కుండబద్దలు కొట్టినట్టు సమాచారం.

కొంత మంది ఎమ్మెల్యేలు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. బీఆర్‌ఎస్ లో కొనసాగేందుకు ఆయన నిరాసక్తత చూపారని తెలుస్తోంది. కాంగ్రెస్(Congress) లో చేరేందుకే మల్లారెడ్డి మొగ్గుచూపుతున్నారని, అది సాధ్యం కాకపోతే బీజేపీ(BJP) లోకి వెళ్లేందుకూ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే కాబోలు రాష్ట్రంలోని కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నందున.. బెంగళూరులో డీకే శివకుమార్‌ను కలిసి కాంగ్రె్‌సలో చేరేందుకు సానుకూలత వ్యక్తం చేసి ఉండవచ్చు.

See also  TIDCO Houses: టిడ్కో గృహాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది -రేపల్లె జనసేన అధ్యక్షులు రాసంశెట్టి మహేష్!

పార్టీలు మారడం Malla Reddy కి కొత్తేమి కాదు. 2014, మార్చి 19న తెలుగుదేశం పార్టీలో చేరిన మల్లారెడ్డికి, 2014, ఏప్రిల్ 9న మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం ఎం.పి. అభ్యర్థిగా పార్టీ టికెట్ ఇచ్చింది. 2014, మే 16న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డే. ఆ తరువాత 2016 జూన్ నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి, తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)లో మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారముల, నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రిగా కూడా చేసాడు. ఇక ఇప్పుడు BRS అధికారం కోల్పోవడం తో పార్టీ మార్పు గురించి ఆలోచిస్తున్నటున్నాడు.

కొసమెరుపు: పాత రోజుల్లో రాజకీయ నాయుకులు, వ్యాపారవేత్తలు వేరు వేరు గా ఉండే వారు. బిజినెస్ చేసుకునే వాళ్ళు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేవారు, తమ బిజినెస్ లకు అనుకూలంగా పాలసీలు చేయించుకోవడానికి. తరువాత నెమ్మదిగా రాజకీయ వేత్తలే వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారం చేసే వారు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. తమ వ్యాపారాలకు అనువుగా పాలసీలు చేసుకుంటున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు కూడా. అంతా బాగానే వుంది కానీ బిజినెస్ కం రాజకీయ నాయుకులకు పెద్ద ప్రాబ్లెమ్ వచ్చి పడింది. అది ఏమిటంటే అధికారం ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి మారినప్పుడల్లా వీళ్ళు కూడా అధికారం లో వున్న పార్టీలోకి మారాల్సి రావడం. What a Pity? ఇక ప్రజలైతే స్థిరంగా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే లాగా.. అలాగే నోరు తెరుచుకుని ఏ పార్టీ వస్తుంది తమకు ఏమి ఉచితంగా ఇస్తుంది అని చూస్తూనే వున్నారు పాపం.

See also  SC Reserved Seats: ఏపీలో ఎక్కువ ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు గెలుచుకున్న పార్టీయే అధికారంలోకి వస్తుంది! ఒక విశ్లేషణ..

రాజకీయాలు, వ్యాపారాలు చేసుకునే వేరు వేరుగా ఉంటేనే అధికారం మారినప్పుడల్లా పార్టీ మారే సమస్య తగ్గుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top