Shanmukh Jaswanth: షణ్ముఖ్‌ కేసులో ట్విస్ట్.. రంగంలోకి దిగిన ప్రముఖ న్యాయవాది కల్యాణ్‌ దిలీప్ సుంకర!

Share the news
Shanmukh Jaswanth: షణ్ముఖ్‌ కేసులో ట్విస్ట్.. రంగంలోకి దిగిన ప్రముఖ న్యాయవాది కల్యాణ్‌ దిలీప్ సుంకర!

Shanmukh Jaswanth: యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జశ్వంత్ ను గురువారం నార్సింగి పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే! తన సోదరుడు సంపత్ వినయ్‌పై ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు షణ్ముఖ్‌ ఇంటికి వెళ్లగా అతను గంజాయి సేవిస్తూ కనిపించాడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్త నిన్న మనం చూసాం. వైద్యపరీక్ష చేయగా షణ్ముఖ్‌ గంజాయి తీసుకున్నట్లు నిర్థారణ అయినట్లు కూడా టాక్ వచ్చింది. ఇక షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌పై ఇప్పటికే చీటింగ్‌ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడు షణ్ముఖ్‌ కేసును వాదించేందుకు ప్రముఖ న్యాయవాది కల్యాణ్‌ దిలీప్ సుంకర (Kalyan Dileep Sunkara) రంగంలోకి దిగడం సంచలనం గా మారింది.

Shanmukh Jaswanth కేసు వాదించడానికి రంగంలోకి దిగిన కల్యాణ్‌ దిలీప్ సుంకర

ఈ సందర్భంగా షణ్ముక్‌ పై గంజాయి కేసు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న కథనాలపై కల్యాణ్‌ దిలీస్‌ సుంకర స్పందించారు. ”షణ్ముఖ్ కేసు, ఆయన సోదరుడు కేసు నేను టేకప్‌ చేశాను. షణ్ను తండ్రి నా వద్దనే ఉన్నారు. షణ్ముక్‌ పై మీడియాలో వస్తున్న కథనాలకు ఏ సంబంధం లేదు. అన్ని ఆధారాలు పోలీస్‌లకు సమర్పిస్తున్నాం. మరిన్ని వివరాలు విపులంగా తెలియజేస్తాను’’ అని ట్వీట్‌లో తెలిపారు.

షణ్ముఖ్ జస్వంత్ బెయిల్‌పై బయటకు వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షణ్ముఖ్ తరపు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర్ ఈ ఫోటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో షణ్ముఖుడు మాత్రమే ఉన్నాడు. అతని సోదరుడు సంపత్ వినయ్ లేడు.

See also  Ind vs Eng 1st Test Day2: 175 పరుగుల ఆధిక్యంలో భారత్.. సత్తా చాటిన రాహుల్ & జడ్డు..

షణ్ముఖ్ జస్వంత్ ఇంట్లో గంజాయి దొరికిన మాట వాస్తవమేనని ఏసీపీ రమణ తెలిపారు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేసి లైంగికంగా వాడుకుని వదిలేశాడని షణ్ముఖ్ సోదరుడిపై వైజాగ్‌కు చెందిన యువతి ఫిర్యాదు చేసింది. వారు హైదరాబాద్‌లోని ప్రజ్తీస్ హోమ్స్‌లో ఉంటున్నారని.. ఆ ఫిర్యాదుతో అక్కడికి వెళ్లగా.. షణ్ముఖ్ కూడా ఇంట్లో కనిపించాడని ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు.

‘‘గంజాయి దొరికిన పరిమాణం చాలా తక్కువ.. అయితే తక్కువ మొత్తంలో గంజాయి దొరికినా నేరం.. కానీ సెక్షన్లు వేరు.. అందులో భాగంగానే కేసు నమోదు చేశాం.. దర్యాప్తు కొనసాగుతోంది.. ఎలాంటి శిక్ష పడుతుందో త్వరలో తెలుస్తుంది. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్‌పై అభియోగాలున్నాయి.కాబట్టి ఆయనపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అమ్మాయి వైజాగ్‌లో అబ్బాయిని వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ కేసు పెట్టింది. అన్నీ పరిశీలించి కేసు మా పరిధిలోకి రాదని తేలితే వైజాగ్‌కు బదిలీ చేస్తాం’’ అని ఏసీపీ తెలిపారు.

అయితే షణ్ముఖ్ జస్వంత్ గతంలోనూ వార్తల్లో నిలిచాడు. గతంలో షణ్ముఖ్ జస్వంత్ హైదరాబాద్‌లో మద్యం మత్తులో అతివేగంతో వాహనం నడుపుతూ వాహనాలను ఢీకొట్టాడు. ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్నాడు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top