
నీటి ట్యాంకులో కోతుల మృతదేహాలు(Monkeys Dead Bodies)
నందికొండ, నాగార్జునసాగర్: నందికొండ(Nandikonda) మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ లో సుమారు 30 కోతుల మృతదేహాలు(Monkeys Dead Bodies) కుళ్లిపోగా.. గత కొన్ని రోజులుగా సరఫరా అవుతున్న అదే కలుషిత నీటిని ప్రజలు తాగుతున్న ఘటన సాగర్లో చోటు చేసుకుంది.
వాటర్ ట్యాంకు పై ఉన్న మూత తెరిచి ఉండడంతో… లోపలికి వెళ్లిన కోతులు బయటికి రాలేక అందులోనే మృతి చెందాయి. అయినా నీటి సరఫరా సిబ్బంది కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. ‘ట్యాంక్ శుద్ది చేయడం మరిచారా.. ప్రజల ఆరోగ్యాలతో చేలగాటమాడుతున్నారా’ అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
-By VVA Prasad