Nampally Exhibition: 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Nampally Exhibition: నాంపల్లి గ్రౌండ్స్ లో 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్ 2024)ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక జనవరి 1నుండి పిబ్రవరి 15 వరకు 46రోజులపాటు నగరంలో సండదేసందడి.
Share the news
Nampally Exhibition: 83వ  ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

క్రొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు జనవరి 1నుండి పిబ్రవరి 15 వరకు 46రోజులపాటు నగరంలో సండదే సందడి. అదే హైదరాబాద్ కా నిషాన్ నుమాయిష్(Numaish)…అదే Nampally Exhibition…ఈరోజు తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సహచర మంత్రులు దుద్ధిళ్ళ శ్రీధర బాబు, పొన్నం ప్రభాకర్ ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు..ఈసందర్భంగా సి. ఎం. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,”హైదరాబాద్ కా నిషాన్ నుమాయిష్’ అనీ హైదరాబాద్ అంటే చార్మినార్.. ట్యాంక్ బండ్ తరువాత గుర్తొచ్చేది నుమాయిష్ అని పేర్కొన్నారు. జనవరి 1 సోమవారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 83వ నుమాయిష్ ను ప్రారంభించిన తర్వాత సీఎం సభనుద్దేశించి ప్రసంగించారు. ప్రతీ ఏటా నుమాయిష్ ప్రాధాన్యత తగ్గకుండా నిర్వహిస్తున్న సొసైటీని సీఎం ఈ సందర్భంగా అభినందించారు.
సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీగా అప్ గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం తరపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

See also  Sunburn event పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. పర్మిషన్‌పై సైబరాబాద్ సీపీ క్లారిటీ

సామాజిక బాధ్యతతో విద్యా సంస్థలను నిర్వహిస్తున్నా ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చేందుకు నుమాయిష్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నేటినుండి 45రోజుల పాటు ప్రతి రోజూ సాయంత్రం 3 గం లనుండి రాత్రి 10.30ని ల.వరకూ కొనసాగుతుందని , వందలాదిగా వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గొడవలు జరుగకుండా చూడాలని పోలీసు శాఖకు, మున్సిపల్ శాఖకు ఆదేశించారు.

Nampally Exhibition Stalls

దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఏపీలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వాల స్టాళ్లు మొత్తం 2,400 వరకు ఏర్పాటు కానున్నాయి. టికెట్ ధర రూ.40గా నిర్ధారించారు. వినోదాత్మకమైన పలు విభాగాలు అందుబాటులో ఉంటాయి. ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకుల కోసం ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆహ్లాదకర వాతావరణంలో అందరూ మెచ్చేలా ‘నుమాయిష్’ సాగుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి ఏనుగుల రాజేందర్ కుమార్ తెలిపారు.

See also  CM Revanth Reddy unveiled six guarantees application: ఆరు గ్యారెంటీ ల అభయాస్తం అప్లికేషన్ ఆవిష్కరించిన సీఎం

Nampally Exhibition History

నుమాయిష్ మస్నూత్-ఎ-ముల్కీ అంటే స్థానిక ఉత్పత్తులు & చేతిపనుల ప్రదర్శన , స్థానిక ఉత్పత్తులు & వారి చేతిపనులను ప్రదర్శించడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ల బృందం 1938లో ప్రారంభించబడింది . ఇది హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలన . 1938లో పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రారంభమైన కేవలం 100 స్టాల్స్ నుండి , వేదిక నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు మార్చబడింది . పేరు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా మార్చబడింది మరియు 2009లో దాని అసలు పేరు నుమాయిష్‌గా మార్చబడింది .

@సురేష్ కశ్యప్

Also Read News

Scroll to Top