New High Court in Telangana: 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు – సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

New High Court in Telangana: రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని CM Revanth Reddy అధికారులను ఆదేశించారు
Share the news
New High Court in Telangana: 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు – సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

New High Court in Telangana: రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి వచ్చే జనవరిలో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని CM Revanth Reddy అధికారులను ఆదేశించారు. గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (MCHRD) లో సంబంధిత అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన అవశ్యకతను చీఫ్ జస్టిస్, న్యాయవాదులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

New High Court in Telangana

ఈ నేపథ్యంలో వారు రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎంను కోరారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్ ల నిర్మాణానికి కూడా చొరవ చూపాలని చీఫ్ జస్టిస్, న్యాయవాదులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత High Court భవనం Heritage Building కాబట్టి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కూడా CM గుర్తు చేశారు. ప్రస్తుత High Court భవనాన్ని రినోవేషన్ చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

See also  Reason behind quality liquor in AP again? మళ్లీ రాష్ట్రంలో క్వాలిటీ మద్యం ప్రవేశపెట్టడం వెనుక కారణం..?

Also Read News

Scroll to Top