Padma Awardees honored: వెంకయ్య, చిరంజీవి ల చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు గ్రహితలకు నగదు బహుమతి

Share the news
Padma Awardees honored: వెంకయ్య, చిరంజీవి ల చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు గ్రహితలకు నగదు బహుమతి

Padma Awardees honored

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ఆదివారం శిల్పకళా వేదికలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పద్మ అవార్డు గ్రహితల(Padma Awardees) సన్మాన సభకు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పద్మ విభూషన్(Padma Vibhushan) అవార్డు గ్రహితలు మాజీ ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu), సినీ నటుడు చిరంజీవి(Chiranjeevi), పద్మశ్రీ అవార్డు గ్రహితలు వేళు ఆనందాచారి, దాసరి కొండప్ప, ఉమా మహేశ్వరి, గడ్డం సాంబయ్య, కేతావత్ సోమ్ లాల్, కూరెళ్ల విఠలాచార్య లను సత్కరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కవులను, కళాకారులను గుర్తించి ప్రోత్సహించడం ప్రభుత్వాల భాద్యత అని అలా జరగనపుడు మన భాష, సాంప్రదాయాలు అంతరించి పోయే ప్రమాదం ఉంటుందని అన్నారు. భాష, సాంవప్రదాయాలను కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి ఎక్కరి పై ఉందని రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకం అవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు.

ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పుట్టి వారికి వచ్చిన కళలలో రానిస్తున్న కళాకారులకు చప్పట్లు, దుప్పట్లే మిగులుతున్నాయని వారి కనీస అవసరాలకు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన చేందారు. కళాకారులను ప్రోత్సహించేందుకే పద్మ అవార్డు గ్రహితలకు సన్మాన సభ ఏర్పాటు చేశామని ఇది రాజకీయాలకు అతీతమైన సభ అని అన్నారు. అవార్డు గ్రహీతలకు 25 లక్షల రూపాయల నగదు బహుమతి, ప్రతి నెల 25 వేల పెన్షన్ ను ప్రభుత్వం అందిస్తుందన్నారు.

See also  Chiranjeevi Biography: చిరంజీవి జీవిత చరిత్రను రాయునున్న ప్రముఖ రచయిత యండమూరి

భారత దేశంలో అత్యధిక దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఏకైక నాయకుడు వెంకయ్య నాయుడని అలాంటి వారు దేశ ఉప రాష్ట్రపతిగా పని చేయడం మన తెలుగు వారికి గర్వ కారణమని అన్నారు. భవిష్యతుతలో వారు రాష్ట్ర పతి పదవిని కూడా చేపట్టాలని ఆకాక్షించారు.

ఒకటి రెండు సినిమాలు విజయవంతమవగానే గర్వపడే నటులు ఉన్న ఈ రోజులలో 46 సంవత్సరాలు నిర్విరామంగా 150 కి పైగా సినిమాలు చేసి కూడా నిగర్విగా ఉండటం ఒక చిరంజీవికే చెల్లిందని కితాబునిచ్చారు. కవులు, కళాకారులు, భాషా, సాంప్రదాయాలను కాపాడు కునేందుకు తమ ప్రభుత్వం ఎప్పడు ముందంజలో ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు చిరంజీవి ల చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు గ్రహితలకు(Padma Awardees) నగదు బహుమతి 25 లక్షల రూపాయల చెక్కులను అందచేశారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సినిమాటో గ్రాఫి, రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంస్కృతిక, ఎక్సైజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు ప్రజాప్రతి నిధులు, అధికారులు, కళాకారులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top