Telangana

Telangana

Adani Group

Adani Group to invest 12,400 crore in Telangana: రూ.12400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

తెలంగాణలొ అదానీ భారీ పెట్టుబడులురూ.12400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలుత్వరలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుసీఎం రేవంత్ రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ తెలంగాణలొ Adani Group భారీ పెట్టుబడులు తెలంగాణలో భారీ పెట్టుబడులకు అదానీ గ్రూప్(Adani Group) ముందుకొచ్చింది. దావోస్‌(Davos)లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో(WEF) Gautam Adani), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో భేటీ అయ్యారు. మొత్తం రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందాలు (MoU) చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో Adani Group చైర్మన్ గౌతమ్ అదానీ, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ సీఈవో ఆశిష్ రాజ్‌వంశీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణలో అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేస్తుంది. దీనికి రూ. 5 వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది. చందన్వల్లిలో అదానీ కొనెక్స్ (AdaniConneX) డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర్పాటుకు రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ రాష్ట్రంలో రూ.1400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. అదానీ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ పార్క్ లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలకు అదానీ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీకి హామీ ఇచ్చారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించిందని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ ఆనంద్ అన్నారు. కొత్త పారిశ్రామిక విధానం మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా ఉందని, తమకందించిన ప్రోత్సాహంతో తెలంగాణలో అదానీ గ్రూప్ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. త్వరలో స్కిల్ యూనివర్సిటీ by Adani Group ప్రజా పాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అత్యంత ప్రాధాన్యాల్లో ఒకటిగా ఎంచుకున్న స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై గౌతమ్ అదానీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. దీంతో యువతీ యువకుల నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని.. పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని సీఎం అన్నారు. తెలంగాణలో తమ పెట్టుబడులతో పాటు స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు అదానీ తన సంసిద్ధతను వ్యక్తపరిచారు. త్వరలోనే ఇంటిగ్రేటేడ్ స్టేట్ ఆప్ ది ఆర్ట్ స్కిల్లింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అదానీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. ఇఫ్పటికే తెలంగాణలో అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని, ప్రపంచంలోని వ్యాపార దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు తెలంగాణ మొట్టమొదటి గమ్యస్థానంగా మారిందని అన్నారు. అదానీ గ్రూప్ తెలంగాణను తమ పెట్టుబడులకు ఎంచుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Adani Group to invest 12,400 crore in Telangana: రూ.12400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు Read More »

Godi India

GODI India to Invest 8000Cr in Telangana: తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రం..

GODI India: దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్ గోడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. GODI India కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని సంబంధించి రూ.8000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

GODI India to Invest 8000Cr in Telangana: తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రం.. Read More »

Aragen Life Sciences

Aragen Life Sciences to invest more in Hyderabad: హైదరాబాద్​లో ఆరాజెన్ విస్తరణ!

Aragen Life Sciences to invest more in Hyderabad: తెలంగాణలో ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. రూ. 2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

Aragen Life Sciences to invest more in Hyderabad: హైదరాబాద్​లో ఆరాజెన్ విస్తరణ! Read More »

Hyderabad to get C4IR

Hyderabad to get C4IR: TS లో నాలుగో పారిశ్రామిక విప్లవం.. హైదరాబాద్​లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీ4ఐఆర్!

Hyderabad to get C4IR: ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ(Telangana)కు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(WEF) అధ్వర్యలో Center for Fourth Industrial Revolution (C4IR) హైదరాబాద్​లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది.

Hyderabad to get C4IR: TS లో నాలుగో పారిశ్రామిక విప్లవం.. హైదరాబాద్​లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీ4ఐఆర్! Read More »

Davos Visit

Invest In Telangana Campaign: దావోస్​లో ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ ప్రారంభించిన సీఎం రేవంత్​రెడ్డి

Invest In Telangana Campaign: ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF) వేదిగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు.

Invest In Telangana Campaign: దావోస్​లో ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ ప్రారంభించిన సీఎం రేవంత్​రెడ్డి Read More »

TSRTC

TSRTC Compassionate Appointments: తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ల కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌!

TSRTC Compassionate Appointments: తెలంగాణ ఆర్టీసీలో 813 కండక్టర్ల కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌! తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పదేళ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

TSRTC Compassionate Appointments: తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ల కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌! Read More »

TS Traffic Challan

TS Traffic Challan Discount: ఈ రోజే లాస్ట్! తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలానాలు కట్టడానికి..

TS Traffic Challan Discount: ఈ రోజే లాస్ట్! తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలానాలు కట్టడానికి.. సైబర్‌ నేరస్థులు నకిలీ వెబ్‌సైట్‌తో వాహనదారులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని.. చలానాల చెల్లింపులో ఎలాంటి సందేహం ఎదురైనా 040-27852721, 8712661690(వాట్సాప్‌) నంబర్లలో సంప్రదించాలన్నారు. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్‌, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా చెల్లింపులు జరపాలని పోలీసులు సూచిస్తున్నారు.

TS Traffic Challan Discount: ఈ రోజే లాస్ట్! తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలానాలు కట్టడానికి.. Read More »

Formula E-Race

Bhatti on Formula E-Race: ఫార్ములా ఈ-రేస్‌ రద్దు ఎందుకో వివరించిన భట్టి!

సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఏవిధమైన ముందస్తు అనుమతులు లేకుండా నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్‌(Formula E-Race) ఒప్పదం, నిర్వహణ పై న్యాయపరంగా ముందుకు వెళ్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Bhatti on Formula E-Race: ఫార్ములా ఈ-రేస్‌ రద్దు ఎందుకో వివరించిన భట్టి! Read More »

HCCB

HCCB: తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ఆసక్తి చూపుతున్న కూల్‌ డ్రింక్స్‌ తయారీ కంపెనీ

తెలంగాణ(Telangana) పారిశ్రామిక అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ప్రముఖ కూల్‌ డ్రింక్స్‌ తయారీ కంపెనీ హిందుస్థాన్ కోకా కోలా బెవెరేజెస్ (HCCB) ముందుకొచ్చింది

HCCB: తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ఆసక్తి చూపుతున్న కూల్‌ డ్రింక్స్‌ తయారీ కంపెనీ Read More »

FCI

Rice to FCI: ఎఫ్‌సిఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయాలి.. కలెక్టర్లు, అధికారులతో మంత్రి, సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో మంత్రి, సీఎస్ వీడియో కాన్ఫరెన్స్. జనవరి 31వ తేదీలోపు భారత ఆహార సంస్థకు (FCI) బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Rice to FCI: ఎఫ్‌సిఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయాలి.. కలెక్టర్లు, అధికారులతో మంత్రి, సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ Read More »

Scroll to Top