
Pavitra Jayaram Dies
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ తెలుగు, కన్నడ టీవీ నటి(TV Actor) పవిత్ర జయరాం (42) దుర్మరణం చెందారు.
కర్ణాటకలోని తమ సొంత గ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో వేగంగా వస్తున్న వారి వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో టీవీ నటి పవిత్ర జయరాం (42) అక్కడికక్కడే మృతి(Pavitra Jayaram Dies) చెందారు. ఈ సంఘటనలో వారి బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, ఆమె తోటి నటుడు చంద్రకాంత్ (చందు) కు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే భూత్పూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా పవిత్ర జయరాం జీ తెలుగులో వస్తున్న త్రినయని సీరియల్‌లో(Trinayani serial) తిలోత్తమ(Tilottama) అనే నెగిటివ్ రోల్ ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆమె అంతకు ముందు తెలుగులో ‘నిన్నే పెళ్లాడతా, స్వర్ణా ప్యాలెస్, కోడళ్ళూ.. మీకు జోహర్లు’ అనే సీరియల్స్ లోనూ ప్రతినాయిక పాత్రలతో మెప్పించారు.
-By VVA Prasad