SB Organics Reactor explosion: సంగారెడ్డి జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఆరుగురు దుర్మరణం!

Share the news
SB Organics Reactor explosion: సంగారెడ్డి జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఆరుగురు దుర్మరణం!

SB ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో Reactor explosion

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని SB ఆర్గానిక్(SB Organics) కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి(Reactor explosion) ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో మృతదేహాలు వందల మీటర్ల దూరంలో ఎగిరి పడినట్లు తెలుస్తోంది. రియాక్టర్ పేలడంతో మూడు భవనాలు కూడా కూలినట్లు సమాచారం. పరిశ్రమలో మరో రియాక్టర్‌కు సైతం మంటలు వ్యాపించడంతో అది కూడా పేలే అవకాశం ఉందని స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని కంపెనీ డైరెక్టర్ రవిశర్మ, ప్రొడక్షన్ ఇంఛార్జ్‌లు సుబ్రహ్మణ్యం, దయానంద్, మెయింటెనెన్స్ ఇంచార్జ్ సురేష్ పాల్ గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. పరిశ్రమ పరిసరాల నుంచి ప్రజలను హుటాహుటిన పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.

See also  Rushikonda Buildings Night-View Visuals: రుషికొండ భవనాల రాత్రి పూట దృశ్యాలు!

ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. తక్షణమే సహాయక చర్యలు వేగవంతం చేసి, మంటలు అదువులోకి తీసుకురావాలని అగ్నిమాపక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి జిల్లా అధికారులకు సూచించారు.

-By VVA Prasad

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top