Banjara: బంజారా భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్ 285 జయంతి ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి

Share the news
Banjara: బంజారా భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్ 285 జయంతి ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి

Banjara భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్ 285 జయంతి ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పీచ్

బంజారా(Banjara) సోదరులను కలవడమంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్నంత ఆనందం. 1976లో ఇందిరమ్మ బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చారు.

రాష్ట్ర స్ధాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో బంజారాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దామాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియాగాంధీ గారిది. దొరల రాజ్యం పోవాలి.. పేదల రాజ్యం రావాలని మీరు నినదించారు. మీ ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది..

సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం నిర్ణయించింది..సేవాలాల్ జయంతి ఉత్సవాలు జరిపేందుకు కోటి కాదు.. మరో కోటి జత చేసి రూ.2కోట్లు విడుదల చేస్తున్నాం..తక్షణమే జీవో మంజూరు చేయాలని అధికారులకు ఆదేశిస్తున్నా

అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. చదువులను తండాకు తీసుకెళ్లే బాధ్యత మాది. గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత మా ప్రభుత్వానిది. గ్రామ పంచాయతీలుగా మారిన తండాలకు పంచాయతీ భవనాలు నిర్మిస్తాం.

See also  BILT Mill పునరుద్ధరించాలి..ఫిన్ క్వెస్ట్, ఐటీసీ ప్రతినిధులతో సీఎం రేవంత్​రెడ్డి

కరెంటు, తాగునీరు… ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసురండి. మీ అభివృద్ధి కోసం మా ప్రభుత్వం కృషి చేస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్స్ లో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం చదువుకున్నప్పుడే సమాజంలో గౌరవం ఉంటుంది. చదువుల బాట పట్టండి.. సంత్ సేవాలాల్ మార్గంలో నడవండి..

70రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా మేం సెలవు తీసుకోలేదు. ఇది ఎవరికీ కనిపించకుండా దాచుకునే ప్రభుత్వం కాదు.. మీ కోసం.. మీ అభ్యున్నతి కోసం కష్టపడే ప్రభుత్వం. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయండి..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top