Revanth Reddy meets Modi: CM హోదాలో తొలిసారిగా ప్రధాన మంత్రి మోడీని కలిసిన రేవంత్, వెంట Dy. CM భట్టి విక్రమార్క

Share the news
Revanth Reddy meets Modi: CM హోదాలో తొలిసారిగా ప్రధాన మంత్రి మోడీని కలిసిన రేవంత్, వెంట Dy. CM భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వపరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య, ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం మొట్ట మొదటిసారిగా దేశ ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క కలవడం జరిగింది.

Revanth Reddy meets Modi: భేటీ వివరాలు

అనంతరం ప్రధాన మంత్రి మోడీ తో జరిగిన భేటీ వివరాలను వారిరువురూ పత్రికా సమావేశంలో వెల్లడించారు. ముందుగా భట్టి మాట్లాడుతూ , ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా,సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం మన రాష్ట్రానికి రావలసిన విభజన చట్టంలోని హక్కులు, ప్రయోజనాల గురించి దేశ ప్రధాని మోడీ దృష్టికి తీసుకు వెళ్ళాం.

తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి కోరి తెచ్చుకున్నదే.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం. వీటికి సంబంధించి విభజన చట్టంలో పేర్కొన్న హక్కులను సాధించడంలో పది సంవత్సరాలుగా గత (తె)బారాస ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది.

See also  CM Revanth Reddy Appeals: రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన PM నరేంద్ర మోడీకి CM రేవంత్ రెడ్డి అందించిన విజ్ఞప్తులు!
Revanth Reddy meets Modi

విభజన చట్టం ద్వారా తెలంగాణకు రావలసిన హక్కులు, హామీలను త్వరితగతిన అమలు చేయాలని ప్రధాని మోడీని ఈ సందర్భంగా కోరడం జరిగిందినీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటిఐఆర్ ప్రాజెక్టులను వెంటనే ఏర్పాటు చేయడం కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని భట్టి అన్నారు.

తెలంగాణ కావాలని ఏ నీళ్ల కోసం పోరాటం చేసామో… ఆ నీళ్లను ఈ రాష్ట్రానికి అందించడానికి విభజన చట్టంలో పొందుపరిచినట్టుగా సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని అందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పరిగణలోకి తీసుకొని సాంక్షన్ ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఐఏఎం, సైనిక్ స్కూల్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 14 రోడ్ల ప్రతిపాదనలు, విభజన చట్టం ప్రకారం బ్యాక్ డెవలప్మెంట్ ఫండ్ పెండింగ్ గ్రాంట్స్ విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారికి ఆదేశాలు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశామ ని తెలియచేశారు. 2019 -20 నుంచి 2023- 24 వరకుపెండింగ్లో ఉన్న దాదాపు 1800 కోట్ల రూపాయలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు.

See also  PM Modi in Telangana: తెలంగాణ లో ₹56,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ!

తెలంగాణ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన తెలంగాణగా నిర్మించాల్సిన బిఆర్ఎస్ ఆర్థిక అరాచకంతో ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని, మించిన అప్పులు తెచ్చి రాష్ట్రంపై పెనుబారం మోపిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మోడీ దృష్టికి తీసుకువెళ్ళమన్నరు. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ భవిష్యత్తు ఆర్థిక అవసరాలను తీర్చేందుకు పెండింగ్ బకాయిలు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశామన్నరు.

2019 -20, 2020-21 సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ బకాయిలు 450 కోట్ల రూపాయలను విడుదల చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన 2,250 కోట్ల రూపాయల గ్రాంట్స్ ను సాధ్యమైనంత వీలుగా విడుదల చేయాలని కోరామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలను అందించాలని తాము చేసిన విజ్ఞప్తికి ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించారనీ, కేంద్రం ఒక రాష్ట్రానికి అందించాల్సిన సాయం ఏ విధంగా అందిస్తామో అదేవిధంగా అందిస్తామని ప్రధానమంత్రి స్పందించినట్లు తెలియచేశారు.

See also  Hyderabad to get C4IR: TS లో నాలుగో పారిశ్రామిక విప్లవం.. హైదరాబాద్​లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీ4ఐఆర్!

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం వివరాల గురించి కూడా ప్రధానమంత్రి కి నివేదిక ఇవ్వడం జరిగింది అన్నారు.

-/సురేష్ కశ్యప్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top