Revenge killing: ప్రగతినగర్లో దారుణం.. యువకుడిని చంపి కత్తులు, రక్తం చేతులతోనే రీల్స్ చేసి ఇన్ స్టాలో పోస్ట్!

Share the news
Revenge killing: ప్రగతినగర్లో దారుణం.. యువకుడిని చంపి కత్తులు, రక్తం చేతులతోనే రీల్స్ చేసి ఇన్ స్టాలో పోస్ట్!

ప్రగతినగర్లో Revenge killing

సోషల్ మీడియా మరియు వెబ్‌సిరీస్‌ల ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పే ఓ భయంకరమైన ఘటన ఇది. చట్టం, పోలీసులు, న్యాయస్థానాలు అనే భయం ఏ మాత్రం లేని ఓ మిత్ర బృందం, ప్రతీకార హత్య(Revenge killing) చేసి దర్జాగా సోషల్ మీడియాలో రీల్స్‌ చేసి పెట్టిన వైనం హైదరాబాద్‌(Hyderabad)లో జరిగింది. ఈ దుర్ఘటనతో ఇటు పోలీసులను, అటు నగర ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు

మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్(Pragati Nagar) లో ఈ దారణం జరిగింది. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన యువకులు… రక్తంతో తడిసిన చేతులతోనే రీల్స్ చేశారు. ప్రగతినగర్ బతుకమ్మ కుంట వద్ద ఓ యువకుడిని ప్రత్యర్థులు హత్య చేశారు. తమతో పెట్టుకుంటే పరిస్థితి ఇలానే ఉంటుందనే హెచ్చరిక చేసేలా ఇన్‌స్టా రీల్స్ చేశారని తెలుస్తోంది. చివర్లో తమ ఫేస్‌లు కూడా చూపించారు. నగరంలోని రోడ్లపై షికార్లు చేస్తూ డ్యాన్స్‌లు కూడా చేస్తూ కనిపించారు.

See also  తొలిరోజే గందరగోళం సృష్టించిన కర్ణాటక K-CET 2024

గత ఏడాది జరిగిన తరుణ్ రాయ్ అనే యువకుడి హత్య కేసులో A3 నిందితుడిగా వున్న సిద్దు అనే యువకుడిని, తరుణ్ రాయ్ స్నేహితులు హత్య చేసినట్లు తెలుస్తుంది. సిద్దు హత్య కేసులో జైలుకు వెళ్లిన సిద్దు రెండు నెలల క్రితమే జైలు నుంచి వచ్చాడు. అతడిని ఈ తెల్లవారు జామున తరుణ్ రాయ్ స్నేహితులు అతి కిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top