
బీఆర్ఎస్ లోకి RS Praveen Kumar
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం (మార్చి 18) ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్(KCR) గులాబీ కండువా కప్పి ఆర్ఎస్ ప్రవీణ్ ను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తాను కూడా కేసీఆర్ లాగే మడమ తిప్పబోనని.. మాట ఇస్తే కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు.
ఇక బలమైన తెలంగాణ వాదానికి బహుజన వాదం కూడా కలిస్తే బాగుంటుందని లోక్‌సభ ఎన్నికల కోసం తాము బీఆర్ఎస్ తో పొత్తు కుదుర్చుకున్నామని అయితే, బీఆర్ఎస్ – బీఎస్పీ పొత్తును రద్దు చేసుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి తమను కోరారని.. తాము ఒప్పుకోకపోవడంతో ఒత్తిడి కూడా చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కానీ, పొత్తు రద్దు చేసుకోవడం తమకు ఇష్టం లేదని అన్నారు. మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నానని ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. ఈ సందర్భంగా బీఎస్పీకి చెందిన దాదాపు 80 మంది నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కొసమెరుపు: ఉద్యమ సమయంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాటిచ్చి ఆ తరువాత ఎన్నో సార్లు మడం తిప్పిన సారు లాగా ఈ ప్రవీణ్ సారూ కూడా మాటకు కట్టుబడి ఉంటాడట. అయినా పొత్తు కుదరక పోతే ఏమవుతుంది, BSP నుంచే నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయవచ్చుగా.