Sunburn event పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. పర్మిషన్‌పై సైబరాబాద్ సీపీ క్లారిటీ

Sunburn event పై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీరియస్ అయిన నేపథ్యంలో ఈవెంట్ పైన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి క్లారిటీ ఇచ్చారు.
Share the news
Sunburn event పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. పర్మిషన్‌పై సైబరాబాద్ సీపీ  క్లారిటీ

Sunburn event పై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీరియస్ అయిన నేపథ్యంలో ఈవెంట్ పైన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన Sunburn మ్యూజికల్ ఈవెంట్‌కు ఎలాంటి అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. Sunburn event నిర్వాహకులు ఈవెంట్ అనుమతికి దరఖాస్తు చేసుకున్నారని అయితే అనుమతి ఇవ్వలేదని తెలిపారు. New Year వేడుకలు నిర్వహించుకునేవారు ముందుగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) హైటెక్ సిటీ సమీపం లో సన్‌బర్న్ మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించ తలపట్టిన విషయం తెలిసిందే. మాదాపూర్‌లోని హైటెక్ సమీపం లో ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకున్నాఈ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్లను online ద్వారా విక్రయించడం చర్చినీయాంశమైంది. ఈ వ్యవహారం పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో మట్లాడిన రేవంత్.. ఈవెంట్‌కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు. అనుమతి ఇవ్వకుండానే బుకింగ్‌లు ఎలా ప్రారంభించారని మండిపడ్డారు. ఇలాంటి ఈవెంట్లపై ఫోకస్ పెట్టాలని పోలీసులకు సూచించారు.

See also  CM Revanth Reddy Appeals: రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన PM నరేంద్ర మోడీకి CM రేవంత్ రెడ్డి అందించిన విజ్ఞప్తులు!

Sunburn Event పై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి క్లారిటీ

ఈ నేపథ్యంలో ‘సన్ బర్న్’ ఈవెంట్‌ నిర్వహణ అనుమతులపై సైబరాబాద్(Cyberabad) సీపీ అవినాష్ మహంతి (CP Avinash Mohanty) తాజాగా స్పందించారు. ఆ ఈవెంట్‌కు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అనుమతి లేకుండా టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బుక్ మై షో ప్రతినిధులను, ఈవెంట్ నిర్వాహకులను పిలిచి హెచ్చరించామని.. అనుమతులు లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పామన్నారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందేనని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి స్పష్టం చేశారు.

కాగా సన్‌బర్న్ అనేది భారీ స్థాయిలో నిర్హహించే సంగీత వేడుక. పలు రాష్ట్రాల్లో ఈ Events నిర్వహిస్తుంటారు. ఈ వేడుల్లో మద్యం అనుమతి ఉంటుంది. హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వేడుకల్లో డ్రగ్స్ వినియోగించే ఛాన్స్ ఉందని.. అనుమతులపై కఠినంగా ఉండాలని పోలీసులకు సూచించారు.

Also Read News

Scroll to Top