Sunburn event in Hyderabad Cancelled: హైదరాబాద్ లో తలపెట్టిన Sunburn కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న నిర్వాహకులు

Share the news
Sunburn event in Hyderabad Cancelled: హైదరాబాద్ లో తలపెట్టిన Sunburn కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న నిర్వాహకులు

Sunburn event in Hyderabad Cancelled: నూతన సంవత్సర సందర్బంగా హైదరాబాద్ లో తలపెట్టిన Sunburn కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న నిర్వాహకులు. బుక్ మై షో(Book My Show) లో టికెట్ విక్రయం కూడా ఆపేసారు. ఈ ఈవెంట్ నిర్వాహకుడు సుమంత్ పైన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అనుమతి లేకుండా టిక్కెట్టు అమ్మినందుకు బుక్ మై షో అధికారులకు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ బుక్ మై షో లో Sunburn event హైదరాబాద్ కనిపించడం లేదు. కానీ వైజాగ్ Sunburn event కి మాత్రం టికెట్స్ అమ్ముతున్నారు.

Also Read: Sunburn event పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. పర్మిషన్‌పై సైబరాబాద్ సీపీ క్లారిటీ

కాగా న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) హైటెక్ సిటీ సమీపం లో సన్‌బర్న్ మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించ తలపట్టిన విషయం తెలిసిందే. మాదాపూర్‌లోని హైటెక్ సమీపం లో ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు కొంత వరకు చేసుకున్నారు. మరో వైపు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకున్నాఈ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్లను online ద్వారా విక్రయించడం చర్చినీయాంశమైంది. చివరికి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు

See also  Free Haleem: హైదరాబాద్ లో ఉచిత హలీం లొల్లి.. దాని కోసం జనం వేలం వెర్రి.. అదుపు చేయడానికి పోలీసుల లాఠీ!

Sunburn event in Hyderabad Cancelled

కాగా సన్‌బర్న్ అనేది భారీ స్థాయిలో నిర్హహించే సంగీత వేడుక. పలు రాష్ట్రాల్లో ఈ Events నిర్వహిస్తుంటారు. ఈ వేడుల్లో మద్యం అనుమతి ఉంటుంది. ఇదే అదను గా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని ఆరోపణలున్నాయి. మొన్న ఈ వ్యవహారం పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో మట్లాడిన రేవంత్.. ఈవెంట్‌కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు. అనుమతి ఇవ్వకుండానే బుకింగ్‌లు ఎలా ప్రారంభించారని మండిపడ్డారు. ఇలాంటి ఈవెంట్లపై ఫోకస్ పెట్టాలని పోలీసులకు సూచించారు. దాంతో సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు బుక్ మై షో ప్రతినిధులను, ఈవెంట్ నిర్వాహకులను పిలిచి మందలించారు. ఈ నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకులు వెనక్కు తగ్గినట్లు తెలుస్తుంది. చివరికి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top