Surprise Inspection at TSPCB: తెలంగాణ PCB కార్యాలయంలో కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ..

Surprise Inspection at TSPCB: సనత్ నగర్ లోని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(TSPCB) కార్యాలయంలో సోమవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ(Konda Surekha) ఆకస్మిక తనిఖీ చేపట్టారు
Share the news
Surprise Inspection at TSPCB: తెలంగాణ PCB కార్యాలయంలో కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ..

Surprise Inspection at TSPCB

సనత్ నగర్ లోని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(TSPCB) కార్యాలయంలో సోమవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ(Konda Surekha) ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ప్రతి సెక్షన్ ను కలియ తిరిగి ఫైళ్ళను పరిశీలించారు. అధికారుల నుంచి వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్ లో నమోదైన వివరాలతో కూడిన హాజరు పట్టికను పరిశీలించి కార్యాలయంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరెవరు లీవ్ లో ఉన్నారో అగిడి తెలుసుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావడం, నిర్ణీత సమయానికి కార్యాలయానికి రాకుండా ఇష్టారీతిన వ్యవహరించే వారి పై కఠిన చర్యలుంటాయని మంత్రి అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు.

అనంతరం కాలుష్య నివారణ, నియంత్రణకు కాలుష్య నియంత్రణ బోర్డు(TSPCB) ఆధ్వర్యంలో చేపడుతున్న పరిశోధనలు, చర్యల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేయకూడదని, సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను విస్తృతంగా అమలుపరచాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ లో తాను ఎప్పుడు తనిఖీ నిర్వహించినా అధికారులు, సిబ్బంది అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని మంత్రి సురేఖ సూచించారు.

See also  AP TET 2024: AP ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 నోటిఫికేషన్ విడుదల, 8th Feb. నుండి దరఖాస్తులు

-By C. Rambabu

Also Read News

Scroll to Top