Tamilisai Resigns: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా!

Share the news
Tamilisai Resigns: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా!

గవర్నర్ తమిళిసై(Tamilisai) రాజీనామా!

తెలంగాణ గవర్నర్ తమిళిసై(Tamilisai) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను పంపారని తెలుస్తోంది. దానితో పాటు పుదుచ్చేరి లెఫ్టనెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా. 2019 సెప్టెంబర్ 8న ఆవిడ తెలంగాణా గవర్నర్ గా ఆవిడ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక గవర్నర్ కాక ముందు ఆవిడ తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పని చేసిన సంగతి తెలిసిందే.

ఆవిడ తమిళనాడు నుంచి బీజేపీ(BJP) తరుపున లోక్ సభకు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారిలో ఎదో ఒక చోటు నుండి ఎంపీ గా బీజేపీ తరుపున పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాడార్ సామాజిక వర్గానికి చెందిన తమిళిసై, ఆవర్గం ఓటర్లు ఎక్కువగా వున్న తిరునల్వేలి, కన్యాకుమారిలలో ఎదో ఒక చోట నుంచి పోటీ చేయవచ్చు.

See also  Volcano Emitting gold: బంగారం వెదజల్లుతున్న అగ్ని పర్వతం!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top