
Telangana Inter Academic Calendar 2024-25
జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్(Inter Academic Calendar) ని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మార్చి 30న ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలలకు ఈ క్యాలెండర్ వర్తించనుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి వెల్లడించారు. ఈ మేరకు 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యా క్యాలెండర్ ను బోర్డు వెల్లడించింది. తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు బోర్డు మార్చి 31 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రకటించిన దాని ప్రకారం తెలంగాణ ఇంటర్ Inter Academic Calendar 2024-25
జూనియర్ కాలేజీల పునఃప్రారంభం: 01.06.2024.
మొదటి, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ తరగతులు: 01.06.2024.
దసరా సెలవులు: 06.10.2024 – 13.10.2024.
దసరా సెలవుల తర్వాత పునఃప్రారంభం: 14.10.2023.
అర్ధ సంవత్సర పరీక్షలు: 18.11.2024 – 23.11.2024.
సంక్రాంతి సెలవులు: 11.01.2025 – 16.01.2025.
సంక్రాంతి సెలవుల తర్వాత పునఃప్రారంభం: 17.01.2025.
ప్రీ-ఫైనల్ పరీక్షలు: 20.01.2025 – 25.01.2025.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: 2025 ఫిబ్రవరి రెండవ వారం నుండి.
ఇంటర్ థియరీ పరీక్షలు: 2025 మార్చి మొదటి వారం నుండి.
వేసవి సెలవులు: 30.03.2025 – 31.05.2025.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: 2025 మే చివరి వారంలో
2025-26 విద్యా సంవత్సరానికి జూనియర్ కళాశాలల పునఃప్రారంభ తేదీ: 01.06.2025.
