
తెలంగాణ యువతకు గుడ్ న్యూస్. ఈనెల 26న మెగా జాబ్(Telangana Mega Job Mela) మేళను నల్గొండ లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన వెల్లడించారు. 100 కి పైగా కంపెనీల్లో 5000 కు పైగా ఉద్యోగ కల్పన లక్ష్యంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.
Telangana Mega Job Mela
స్థానిక యువత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నల్గొండ లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఫిబ్రవరి 26న ఉదయం 9 గంటలు నుండి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణా ఫెసిలిటీ మానేజ్మెంట్ కౌన్సిల్ (TFMC ), తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ మానేజ్మెంట్(TASK ) సహకారంతో కోమటి రెడ్డి ప్రతీక రెడ్డి ఫౌండేషన్ ఆద్వర్యం లో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.10th, ITI, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు తమ రెజ్యూమ్ / సీవీ, తమ అర్హత కు సంబంధించి డాక్యుమెంట్లు తీసుకుని రావాలని ఈ సందర్బంగా సూచించారు.
Mega #Job mela in #Nalgonda on 26/02/24.
— Collector Nalgonda (@Collector_NLG) February 20, 2024
100+ companies & 5000+ jobs…
Do avail the #Employment opportunity.#TASK #TFMC #Prateekfoundation pic.twitter.com/pHVHvyrzFl