Telangana to Focus more on Renewable Energy: పునరుత్పాదక ఇంధన అభివృద్ధి పైన దృష్టి

Telangana to Focus more on Renewable Energy: తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న సోలార్, విండ్, స్మాల్ హైడ్రో పవర్, చెత్త నుంచి విద్యుత్ తయారీ, నిర్వహిస్తున్న కార్యక్రమాలపై రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క TS REDCO అధికారులతో సమీక్ష చేశారు.
Share the news

విద్యుత్ వాహనాల చార్జింగ్(EV Charging) స్టేషన్లను విస్తరించాలి
సోలార్ విద్యుత్ వినియోగం, ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి
సచివాలయంలో టిఎస్ రెడ్కో అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష

Telangana to Focus more on Renewable Energy:  పునరుత్పాదక ఇంధన అభివృద్ధి పైన దృష్టి

Telangana to Focus more on Renewable Energy

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని టీఎస్ రెడ్ కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న సోలార్, విండ్, స్మాల్ హైడ్రో పవర్, చెత్త నుంచి విద్యుత్ తయారీ, నిర్వహిస్తున్న కార్యక్రమాలపై రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క TS REDCO(Telangana State Renewable Energy Development Corporation) అధికారులతో సమీక్ష చేశారు. పెట్రోల్ డీజిల్ వాహనాలతో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడం తో పాటు ఇంధన పొదుపు లో భాగంగా మార్కెట్లోకి వస్తున్న విద్యుత్ వాహనాలకు చార్జింగ్ అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని అధికారులకు సూచించారు.

See also  Hyderabad is Best for Industries: పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రాంతం

Solar and other Renewable Energy

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ కొరత రాకుండా ఉండటానికి సోలార్ విద్యుత్ ను పెద్ద మొత్తంలో వినియోగంలోకి తీసుకురావడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని జలాశయాలపై సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ రూప్ టాప్ సిస్టం ఏర్పాటు చేసుకుని అమలు పరచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సోలార్, విండ్, హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజ్ లాంటి టెక్నాలజీ పాలసీలు పెండింగ్లో ఉన్న అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో డిప్యూటీ సీఎం చర్చించారు.

మున్సిపల్ ప్రాంతాల్లో సేకరించిన చెత్త నుంచి కంప్రెస్డ్ బయో గ్యాస్, విద్యుత్ తయారీ పనులు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలపై ఆరా తీశారు. ఖమ్మం వరంగల్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో బయోగ్యాస్ ప్లాంట్ ల ఏర్పాటు గురించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ కి పంపించిన ప్రతిపాదనల గురించి టీఎస్ రెడ్కో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య డిప్యూటీ సీఎంకు వివరించారు.

See also  Amit Shah in Hyderabad: రాష్ట్ర బీజేపీ కీలక నేతలకు అమిత్ షా వార్నింగ్!

Solar Renewable Energy పైన సబ్సిడీ

రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి గృహ వినియోగదారులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీల పై అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఆదేశాలు ఇచ్చారు. గృహ వినియోగదారులకు ఒక కిలో వాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేందుకు 18 వేల రూపాయల రాయితీ ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పారు. మూడు కిలో వాట్స్ వరకు కిలో వాట్ కు 18 వేల రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తామన్నారు. మూడు కిలో వాట్స్ నుంచి పది కిలో వాట్స్ వరకు కిలో వాట్ కు 9వేల రూపాయల చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు. ఈ అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఉపయోగంతో కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

టీఎస్ రెడ్కో సంస్థ నిర్వహణ,  బోర్డు కమిటీ, సంస్థ ద్వారా అమలు చేస్తున్న పథకాలు, సంస్థ సిబ్బంది పని తీరు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. జానయ్య డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ ప్రసాద్,  ప్రాజెక్ట్ డైరెక్టర్లు రామకృష్ణ, శ్రీనివాస్, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read News

Scroll to Top