
TS BC Study Circle: Free Coaching for Group 1, 2, 3, 4 foundation course
గ్రూప్ 1,2,3,4 ఫౌండేషన్ కోర్సుకు ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రం లోని పన్నెండు బి.సి.స్టడీ సర్కిల్స్ లో నిర్వహిస్తున్నట్లు టి.ఎస్.బి.సి.స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలియచేస్తున్నారు.
అర్హులైన అభ్యర్థులు జనవరి 8నుంచి 24వ తేది వరకు ఆన్లైన్లో tsbcstudycircle.cgg.gov.in.లో తమపేర్లను నమోదు చేసుకోవచ్చు. తల్లిదండ్రుల వార్షికాదాయం ఐదు లక్షల లోపు ఉండాలి. అభ్యర్థుల ఎంపిక డిగ్రీ మార్కుల ఆధారంగా చేస్తారు.
మరిన్ని వివరాల కోసం 040-24071178
040-27077929 నెంబర్ లో సంప్రదించగలరు.

– By రాంబాబు.C