TS Govt to honor Padma Award Winners: పద్మఅవార్డులు అందుకున్న తెలుగు వారిని సత్కరించనున్న TS Govt.

Share the news
TS Govt to honor Padma Award Winners: పద్మఅవార్డులు అందుకున్న తెలుగు వారిని సత్కరించనున్న TS Govt.

TS Govt to honor Padma Award Winners

హైదరాబాద్: ఈ సంవత్సరం పద్మ అవార్డులు అందుకున్న తెలుగు వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు శిల్పకళావేదికలో ఏర్పాటు చేసే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ముఖ్య అతిధిగా హాజరై అవార్డు గ్రహితలను సత్కరిస్తారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మందికి పద్మ అవార్డులు దక్కాయి.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu), సినీ యాక్టర్ చిరంజీవి(Chiranjeevi) లకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ అందచేసింది. చిందు యక్షగాణం కళాకారుడు గడ్డం సమ్మయ్య, స్థపతి కళాకారుడు వేళు ఆనందాచారి, బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, తన ఇంటినే గ్రంధాలయంగా మార్చిన అధ్యాపకుడు కూరెళ్ల విఠలాచార్య, అనేక పాటలను, సంగీతాలను బంజారా బాషలోకి అనువదించిన కళాకారుడు కేతావత్ సోమా లాల్, సంగీత నాటక కళాకారిని ఉమామహేశ్వరి లకు పద్మశ్రీ పురస్కారాలను అందచేసింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

See also  Chiranjeevi Vishwambhara movie: చిరంజీవి 'విశ్వంభర' .. టాలీవుడ్ నుంచి మరో హాలీవుడ్ స్థాయి సినిమా!

కొసమెరుపు: మరి Padma Award Winners ని ఏపీ ప్రభుత్వం ఎప్పుడు సత్కరిస్తుందో?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top