TS Inter Exams 2024 Schedule: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూలు విడుదల

Share the news
TS Inter Exams 2024 Schedule: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూలు విడుదల

తెలంగాణ ఇంటర్‌ 2023-24 వార్షిక పరీక్షల షెడ్యూలును ఇంటర్ బోర్డు డిసెంబరు 28న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌, ఫిబ్రవరి 29 నుంచి ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 17న ఎథిక్స్‌ & హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష, ఫిబ్రవరి 19న ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ఫస్టియర్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ను నిర్వహించనున్నారు. ఈ ప్రాక్టికల్స్‌ను ఫిబ్రవరి 16న నిర్వహించనున్నారు. ఇంగ్లిష్ థియరీ పరీక్షకు 80 మార్కులకు ఉండనుండగా.. ప్రాక్టికల్ పరీక్షకు 20 మార్కులు ఉండనున్నాయి.

See also  Gaddar Jayanti: గద్దర్ జయంతి రోజున ఆయన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయనిచ్చిన ఒక ఇంటర్వూ చూద్దామా!

TS Inter Exams 2024 Schedule

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు..

DateExam
28-02-2024సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I
01-03-2024 ఇంగ్లీష్‌ పేపర్‌-I
04-03-2024 మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IA, బాటనీ పేపర్‌-I, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-I
06-03-2024 మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IB, జువాలజీ పేపర్‌-I, హిస్టరీ పేపర్‌-I
11-03-2024 ఫిజిక్స్‌ పేపర్‌-I, ఎకనామిక్స్‌ పేపర్‌-I
13-03-2024 కెమిస్ట్రీ పేపర్‌-I, కామర్స్‌ పేపర్‌-I
15-03-2024 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-I, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-I
18-03-2024 మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I, జియోగ్రఫీ పేపర్‌-I

ఇంటర్‌ సెకండ్‌ పరీక్షలు..

DateExam
29-02-2024సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II
02-03-2024 ఇంగ్లీష్‌ పేపర్‌-II
05-03-2024 మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IIA, బాటనీ పేపర్‌-II, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-II
07-03-2024 మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IIB, జువాలజీ పేపర్‌-II, హిస్టరీ పేపర్‌-II
12-03-2024 ఫిజిక్స్‌ పేపర్‌-II, ఎకనామిక్స్‌ పేపర్‌-II
14-03-2024 కెమిస్ట్రీ పేపర్‌-II, కామర్స్‌ పేపర్‌-II
16-03-2024 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-II, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-II
19-03-2024 మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II, జియోగ్రఫీ పేపర్‌-II

TS Inter Exams 2024 Schedule

TS Inter Exams 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top