TS Traffic Challan Discount: ఈ రోజే లాస్ట్! తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలానాలు కట్టడానికి..

Share the news
TS Traffic Challan Discount: ఈ రోజే లాస్ట్! తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలానాలు కట్టడానికి..

TS Traffic Challan Discount- ఈ రోజే లాస్ట్!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు వాహనదారులకు రాయితీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు ఈ రాయితీలు అమలులో ఉంటాయని పేర్కొంది. ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించింది. మరోవైపు చలాన్లు చెల్లించేందుకు గడువు ఇవాళ ఒక్క రోజు ఉండటంతో  వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

వాహనదారులకు పెండింగ్ ట్రాఫిక్ చలానాల చెల్లింపులకోసం ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. ఈ విధంగా రాయితీని గతంలో కూడా ఒకసారి ప్రకటించింది. అయితే ఈసారి రాయితీని గతంలోకంటే ఎక్కువ రాయితీని ప్రకటించడం విశేషం. చాలా మంది వారి పెండింగ్‌ చలాన్లను చెల్లిస్తున్నారు. మీ సేవా కేంద్రాల్లో, ఆన్‌లైన్‌లలో చలాన్ల రుసుమును చెల్లించే అవకాశాన్ని కల్పించింది తెలంగాణ ట్రాఫిక్ విభాగం.

See also  TSPSC Group2 Exam Postponed: ముచ్చటగా 3 వ సారి వాయిదా పడ్డ TSPSC Group2 Exam. త్వరలో కొత్త తేదీలు వెల్లడి!

వాహనదారుల నుంచి పెండింగ్‌ ట్రాఫిక్‌ చలానాల చెల్లింపులకు అనూహ్య స్పందన లభిస్తోంది. TS Traffic Challan చెల్లింపుల విషయమై రాయితీ ప్రకటించిన సమయానికి, ట్రాఫిక్ పోలీసుల రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలానాలు ఉన్నాయి. చాలా కాలంగా లెక్కకు మించి పేరుకుపోయిన వీటన్నింటిని తగ్గించుకునే ఉద్దేశంతో, బైక్‌లు, ఆటోలకు 80%.. ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% రాయితీ ప్రకటించటంతో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వాహనదారులు పెద్దఎత్తున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

Also Read: TS Traffic police to give up to 80% discount on traffic challans: వాహనదారులకు క్రిస్మస్ & సంక్రాంతి కానుక!

TS Traffic Challan: సైబర్‌ నేరగాళ్ల మోసాలు

ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి ఎవరికీ అనుమానం రాకుండా డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులకు ఎన్నో ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో సైబర్‌ మాయగాళ్ల బారినపడకుండా ఉండేందుకు రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. గతంలో ఢిల్లీలో ఇదే తరహాలో వాహనదారుల నుంచి సొమ్ము కొట్టేసిన సైబర్‌ ముఠాలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

See also  TS EAPCET 2024: టీఎస్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్స్ ల్లోకి ప్రవేశ పరీక్ష.. నోటిఫికేషన్ విడుదల!

కాగా జనవరి 10వ తేదీ వరకు మాత్రమే చలానాలపై డిస్కౌంట్‌‌కు అవకాశం ఉందని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ తెలిపారు. ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సైబర్‌ నేరస్థులు నకిలీ వెబ్‌సైట్‌తో వాహనదారులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని.. చలానాల చెల్లింపులో ఎలాంటి సందేహం ఎదురైనా 040-27852721, 8712661690(వాట్సాప్‌) నంబర్లలో సంప్రదించాలన్నారు. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్‌, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారానూ చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు వివరించారు.

TS Traffic Challan: Official website

కేవలం అక్షరం మార్పుతో నకిలీ వెబ్‌సైట్‌ రూపొందించి సోషల్ మీడియా, మొబైల్ నంబర్లకు లింకులు పంపుతున్నారు. వినియోగదారులు జాగ్రత్త వహించాలి. ఇలాంటి మోసాల బారినపడకుండా ఉండేందుకు వాహనదారులు మీ-సేవ కేంద్రాలు, పేటీఎం వాలెట్‌, https://echallan.tspolice.gov.in/publicview/ ద్వారా చెల్లింపులు జరపాలని పోలీసులు సూచిస్తున్నారు.

-By రాంబాబు.C

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top