TS Traffic police to give up to 80% discount on traffic challans: వాహనదారులకు క్రిస్మస్ & సంక్రాంతి కానుక!

Share the news
TS Traffic police to give up to 80% discount on traffic challans: వాహనదారులకు క్రిస్మస్ & సంక్రాంతి కానుక!

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానాలు పడిన వాహనదారులకు శుభవార్త! తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం పెండింగ్‌లో ఉన్న చలాన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించారు. ఇవి డిసెంబర్ 26 నుంచి జనవరి 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.

గతేడాది కూడా పెండింగ్ చలానాలపై రాయితీ ఇవ్వగా.. ఏకంగా రూ.300 కోట్ల వరకు చలానాలు వసూలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్లకు పైగా చలానాలు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ ఏడాది కూడా మరోసారి చలాన్లపై డిస్కౌండ్ ప్రకటించినట్లు తెలుస్తోంది. పెండింగ్ చలానాలపై భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటించటంతో.. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్లియర్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు .

TS Traffic police to give up to 80% discount on traffic challans:

ఏఏ వాహనాలకు ఎంతెంత డిస్కౌంట్..

ద్విచక్రవాహనాల చలాన్లకు 80 శాతం డిస్కౌంట్
ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్
లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కు 50 శాతం డిస్కౌంట్
ఈనెల 26 నుంచి జనవరి 10 వరకు చలాన్లు డిస్కౌంట్‌తో కట్టే అవకాశం

See also  Monkeys Dead Bodies: నల్లగొండ జిల్లాలో ఘోరం! నీటి ట్యాంకులో కోతుల మృతదేహాలు.. బాధ్యత లేని అధికారులు..

ఈ పెండింగ్ చలాన్లను ఆన్‌లైన్‌తో పాటు మీసేవా సెంటర్లలలో డిస్కౌంట్‌తో కట్టే అవకాశాన్ని కల్పించారు
మీ వాహనం పైన ఎన్ని చలాన్ లు ఉన్నాయో తెలుసు కోవడానికి ఈ లింక్ https://echallan.tspolice.gov.in/publicview/ క్లిక్ చేసి చెక్ చేసుకోండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top