TSPSC Group 2 పరీక్ష మళ్లీ వాయిదా పడనుందా? ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ!

TSPSC Group 2 Exam Updates: ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన Group 2 Exam.. ఇప్పుడైనా జరుగుతుందా.. లేదా వాయిదా పడుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు అభ్యర్థుల్లో టెన్షన్ రేకెత్తిస్తోంది.. ప్రకటించిన దాని ప్రకారం అయితే.. జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించ వలసి వుంది.
Share the news
TSPSC Group 2 పరీక్ష మళ్లీ వాయిదా పడనుందా? ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ!

Telangana లో కొత్త సర్కారు సంచలన నిర్ణయాలతో పాలనను ఉరుకులు పెట్టిస్తోంది. నిత్యం సమీక్షలతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మరో పక్క కొత్త ప్రభుత్వం రావటం, TSPSC లో ఛైర్మన్ సహా బోర్డు సభ్యులు రాజీనామా చేయటం లాంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష నిర్వాహణ విషయంలో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. TSPSC Group 2 పరీక్ష మళ్లీ వాయిదా పడుతుందా అన్న అనుమానం ఇప్పుడు అభ్యర్థులను టెన్షన్ పెడుతోంది. అయితే.. ఇప్పటికే రెండుసార్లు గ్రూప్-2 పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసందే. ప్రస్తుతానికైతే జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించాల్సి వుంది.

TSPSC Group 2 exam

కాగా TSPSC కొత్త సభ్యుల నియామకం ఇంకా జరగలేదు. దీనితో పరీక్ష నిర్వహాణకు కూడా ఏర్పాట్లు సరిగా జరగినట్లు లేవు. ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి TSPSC పరిధిలోని పరీక్షల నిర్వాహణ విషయంలో వరుస సమీక్షలు నిర్వహించి.. పరీక్షలన్నింటినీ రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ తాజా పరిణామాలన్ని చూస్తే.. గ్రూప్-2 కూడా మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే.. ఈ విషయంపై TSPSC మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయకపోవటం గమనార్హం. దీనితో అసలు పరీక్ష జరుగుతుందా లేదా అనే అనుమానం మాత్రం అభ్యర్థుల్లో ఏర్పడింది. అయితే.. అధికారులు ఈ విషయంపై కలుగజేసుకుని ఓ క్లారిటీ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్ష నిర్వాహణపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

See also  TS EAPCET 2024: టీఎస్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్స్ ల్లోకి ప్రవేశ పరీక్ష.. నోటిఫికేషన్ విడుదల!

TSPSC Group 2 exam పోస్టుల వివరాలు
ప్రస్తుంతం 783 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కాగా.. పరీక్ష రాసేందుకు 5 లక్షల 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. గ్రూప్-2 పరిధిలోకి వచ్చే మరిన్ని vacancies కూడా ఉండటంతో.. వాటిని కూడా చేర్చి.. మళ్లీ కొత్త తేదీతో, కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా ఇది పరీక్షార్థులను చాలా చికాకు పెడుతుంది. కొత్త ప్రభుత్వం దీనిపై త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశమైతే ఉంది. ఇక అభ్యర్థులకు చెప్పొచ్చేదేమిటంటే అతి త్వరలో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి, వీటన్నటిని పక్కన పెట్టి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వండి అని.

Also Read News

Scroll to Top