TSPSC Group2 Exam Postponed: ముచ్చటగా 3 వ సారి వాయిదా పడ్డ TSPSC Group2 Exam. త్వరలో కొత్త తేదీలు వెల్లడి!

Share the news
TSPSC Group2 Exam Postponed: ముచ్చటగా 3 వ సారి వాయిదా పడ్డ TSPSC Group2 Exam. త్వరలో కొత్త తేదీలు వెల్లడి!

TSPSC Group2 Exam Postponed: అనుకున్నట్లే మరలా వాయిదా పడ్డ టీఎస్‌పీఎస్సీ ‘గ్రూప్‌-2’ పరీక్ష. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు TSPSC బుధవారం (డిసెంబరు 27) రాత్రి ప్రకటించింది. కొత్త తేదీలను తర్వాత వెల్లడిస్తామని కమిషన్ స్పష్టం చేసింది.

TSPSC Group2 Exam పోస్టుల మరియు Postponement వివరాలు

మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉండగా.. అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలతో వాయిదా పడ్డాయి. ఆ తర్వాత నవంబర్ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వేళ తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మరోసారి ఈ పరీక్ష వాయిదా పడింది. తాజాగా మరోసారి వాయిదా వేస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ అధికారులు ప్రకటించారు.

Also Read: TSPSC Group 2 పరీక్ష మళ్లీ వాయిదా పడనుందా? ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ!

గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

See also  Air Taxi Services: ఇండియాలో త్వరలో ఎయిర్ ట్యాక్సీ సేవలు!

TSPSC Group 2 exam అభ్యర్థులకు సూచన

ఈ వాయిదా అనుకున్నదే కాబట్టి ఎవరూ నిరుత్సాహ పడనవసరం లేదు. రెండు మూడు రోజులు రిలాక్స్ అయి మరలా ప్రేపరేషన్స్ మొదలుపెట్టాలి. ఈసారి వాయిదాలు వుండవు కాబట్టి బాగా ప్రిపేర్ అయితే ఉద్యోగం కొట్టేయవచ్చు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top