TSPSC New Members: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఇక TSPSC ఉద్యోగ నోటిఫికేషన్లకు మార్గం సుగమం!!

Share the news
TSPSC New Members: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఇక TSPSC ఉద్యోగ నోటిఫికేషన్లకు మార్గం సుగమం!!

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి (Mahendar Reddy) నియామకానికి గవర్నర్ తమిళిసై (Tamilisai) గురువారం ఆమోదం తెలిపారు. ఆయనతో పాటు కమిషన్ సభ్యులుగా మరో ఐదుగురి (TSPSC New Members) నియామకానికి కూడా ఆమోద ముద్ర వేశారు. ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజినికుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై.రామ్మోహన్ రావులను సభ్యులుగా నియమించారు.

గత ప్రభుత్వం లో TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాని ఎఫక్ట్ BRS పై పడి అధికారం కూడా కోల్పోయింది. ఈ నేపథ్యం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టీఎస్ పీఎస్సీ (TSPSC) సభ్యులు రాజీనామా చేశారు. దీంతో కమిషన్ ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. UPSC తరహాలోనే పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది.

కాగా, కమిషన్ నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా ఛైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఎ.శాంతికుమారి (Shanthi kumari), న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి (Tirupathi), సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మల(Nirmala)తో కూడిన స్క్రీనింగ్‌ కమిటీ దరఖాస్తులను పరిశీలించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని ప్రతిపాదిస్తూ గవర్నర్ తమిళిసైకు ఫైల్ పంపారు. దీనికి గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో TSPS కొత్త టీం సిద్ధమైంది. దీనితో ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందని నిరుద్యోగులు ఆశ పడుతున్నారు.

See also  CM Ramesh : బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నుంచి కాంగ్రెస్‌కు రూ.30 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు.. కమలంలో కలకలం!

TSPSC New Members List:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top