TSRTC Compassionate Appointments: తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ల కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌!

Share the news

TSRTC Compassionate Appointments

TSRTC Compassionate Appointments: తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ల కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)లో గత పదేళ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కారుణ్య నియామకాల కింద 813 మందిని కండక్టర్లుగా తీసుకోనుంది. ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులు ఇవ్వాలని మంత్రి పొన్నం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆర్టీసీలోని 11 రీజియన్ల నుంచి మొత్తం 813 కండ‌క్టర్ పోస్టుల‌ను కారుణ్య నియామకాల కింద ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఆపబడి ఉన్న నియామకాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు న్యాయం జరగనుందని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి వివరించారు.

Compassionate Appointments అంటే..

కారుణ్య నియామకాలు, మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ స్కీమ్ కింద ఉద్యోగుల జీవిత భాగస్వామి లేదా వారి పిల్లలకు ప్రత్యామ్నాయ ఉపాధిని అందించడానికి వారి విద్యార్హత‌లను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో విధి నిర్వహణలో ఉండగా మరణించిన సిబ్బంది కుటుంబాలకు ఊరట లభించనుంది.

See also  TSPSC Group2 Exam Postponed: ముచ్చటగా 3 వ సారి వాయిదా పడ్డ TSPSC Group2 Exam. త్వరలో కొత్త తేదీలు వెల్లడి!

TSRTC Compassionate Appointments: మొత్తం 813 కండ‌క్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు

ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద హైద‌రాబాద్ రీజియన్ పరిధిలో 66, సికింద్రాబాద్ 126, రంగారెడ్డి 52, నల్గొండ 56, మహ‌బూబ్ నగ‌ర్ 83, మెదక్ 93, వరంగ‌ల్ 99, ఖమ్మం 53, అదిలాబాద్ 71, నిజామాబాద్ 69, కరీంనగర్ రీజియన్‌లో 45.. మొత్తం 813 కండ‌క్టర్ పోస్టుల‌ను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే.. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కండక్టర్ నియామకాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top