CBN at Prajagalam: మోదీపై ప్రశంసల జల్లు.. జగన్ పై నిప్పులు.. -ప్రజాగళం సభలో చంద్రబాబు

CBN at Prajagalam: కరోనా సమయంలో మనందరి ప్రాణాలు మోదీ కాపాడారని కితాబు. ప్రపంచం మెచ్చిన నేత అని వ్యాఖ్య. ప్రజా సంక్షేమం కోసం తపించే వ్యక్తి పవన్ అని ప్రశంస.
Share the news
CBN at Prajagalam: మోదీపై ప్రశంసల జల్లు.. జగన్ పై నిప్పులు.. -ప్రజాగళం సభలో చంద్రబాబు

CBN at Prajagalam

మోదీ(Modi) మనకు అడంగా ఉంటానని చెప్పేందుకు వచ్చారు. మోదీకి 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం. గెలవబోయేది ఎన్డీఏ కూటమి. కూటమికి ప్రధాని మోదీ అండ ఉంది. మోదీ నాయకత్వానికి అండగా ఉంటామని జనం తరలివచ్చారు. జెండాలు వేరు కావొచ్చు.. మా అజెండా ఒక్కటే. సంక్షేమం, అభివృద్ధి మా అజెండా.

కరోనా సమయంలో మనందరి ప్రాణాలు మోదీ కాపాడారని కితాబు. ప్రపంచం మెచ్చిన నేత అని వ్యాఖ్య. ప్రజా సంక్షేమం కోసం తపించే వ్యక్తి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అని ప్రశంస

Also Read: బొప్పూడి ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ ప్రసంగం!

మోదీ ఓ వ్యక్తి కాదు.. ఓ శక్తి. మోదీ అంటే అభివృద్ధి, సంక్షేమం. వికసిత్ భారత్ దిశగా మనదేశం దూసుకుపోతోంది. పేదరికం లేని దేశం అనేది మోదీ కల. మోదీ ఆశయాలతో మనమంతా అనుసంధానం కావాలి. సంక్షేమ పథకాలకు కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి.. మోదీ. అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి.. మోదీ. సబ్‌ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్.. మోదీ నినాదాలు.

See also  Two more guarantees: మరో రెండు గ్యారంటీలు అమలు చేద్దాం.. ప్రజా పాలన దరఖాస్తుల సమీక్షలో CM

CBN at Prajagalam Pics

ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మోదీ. భారత్‌ను శక్తివంతమైన జాతిగా తయారు చేయడమే మోదీ లక్ష్యం. 2014లో మేం వచ్చాక 11 జాతీయ విద్యాసంస్థలను తెచ్చాం. కేంద్ర సాయంతో పోలవరాన్ని 72 శాతం పూర్తి చేశాం. పోలవరాన్ని జగన్(Jagan) గోదారిలో కలిపేశారు. అన్ని ప్రాజెక్టులు నాశనమయ్యాయి. కోట్లలో దోపిడీకి పాల్పడ్డారు. ఐదేళ్లలో పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగింది. మోదీ చేతులు మీదుగా అమరావతి నిర్మాణం ప్రారంభించాం.

మూడు ముక్కలాటతో అమరావతిని జగన్ భ్రష్టు పట్టించారు. శాండ్, ల్యాండ్, వైన్, మైన్.. అన్ని రంగాల్లో దోచేశారు. ఐదేళ్లుగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను తరిమేశారు. విధ్వంసమే తన విధానంగా రాష్ట్రాన్ని కూల్చిన వ్యక్తి.. జగన్. అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారు. జగన్ అధికార దాహానికి సొంత బాబాయే బలయ్యారు. జగన్‌కు ఓటేయవద్దని చెల్లెళ్లే చెప్పారంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. జగన్‌కు ఓటేయవద్దని చెల్లెళ్లే చెప్పారంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. బంగారం లాంటి రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశాడని Chandra Babu Naidu మండిపాటు

See also  Rajesh Mahasena Issue: రాజేష్ మహాసేనను మారుస్తున్నారా? అతని స్థానంలో కొత్త అభ్యర్థిని పరిశీలిస్తున్నారా?

-By Guduru Ramesh Sr. Journalist

Also Read News

Scroll to Top