RC 17: రామ్‌చ‌ర‌ణ్ బర్త్ డే సర్ప్రైజ్ ముందే వచ్చేసింది.. చరణ్, సుకుమార్ సినిమా అనౌన్స్ చేసిన మైత్రి!

Share the news
RC 17: రామ్‌చ‌ర‌ణ్ బర్త్ డే సర్ప్రైజ్ ముందే వచ్చేసింది.. చరణ్, సుకుమార్ సినిమా అనౌన్స్ చేసిన మైత్రి!

RC 17 కోసం మళ్ళీ కలుస్తున్న రామ్ చరణ్ మరియు సుకుమార్!

అగ్ర దర్శకుడు సుకుమార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి చేతులు కలుపబోతున్నారు. ఈ ఇద్దరి కంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన రంగస్థలం(Rangasthalam) ఇండస్ట్రీ హిట్ అవడమే కాదు కల్ట్ క్లాసిక్ మూవీ గా పేరు తెచ్చుకుంది. మరల ఎప్పుడెప్పుడా ఈ ఇద్దరి కాంబినేషన్ అని సినిమా అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో ఈరోజు అధికారికంగా RC 17 గురించి ప్రకటన రావటం టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. రంగస్థలం నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) ఈ సినిమాకి నిర్మాతలు అవటం ఇంకో అశ్శక్తికర అంశం.

మైత్రీ వాళ్ళు సుకుమార్ రైటింగ్స్ తో కలిపి ఈ సినిమాని అత్యంత భారీ సినిమాగా తెర‌కెక్కిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. రంగస్థలం రామ్ చరణ్ నట విశ్వరూపం చూపడమే కాకుండా, కలెక్షన్స్ పరంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అటువంటి సినిమా కన్నా ఇంకా పెద్ద స్కేల్ లో ఈ ఆర్సీ17 ఉండబోతోందని చెపుతున్నారు.

See also  Padma Awardees 2024: చిరంజీవి, వెంకయ్యకు పద్మ విభూషణ్.. Full List here!

ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప 2’ సినిమా చేస్తున్నారు, రామ్ చరణ్ RC 15 & RC 16 సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఇక RC 17 సినిమా ఏడాదిలోనే షూటింగ్ పెట్టి 2025 లాస్ట్ క్వార్ట‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇకపోతే ఈ కొత్త సినిమాకి రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్ర‌సాద్(Devi Sri Prasad) పేరు తోడ‌వ‌డం అభిమానుల్లో మ‌రింత ఉత్సాహాన్ని పెంచేస్తోంది. ‘రంగ‌స్థ‌లం’ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ కాంబినేష‌న్ మ‌రోసారి చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ తో రెడీ అవుతోంది. ఇంత‌మంది హేమాహేమీలు క‌లిసి రూపొందిస్తున్న ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమాటిక్ ఎక్స్ పీరియ‌న్స్ ని నెవ‌ర్ బిఫోర్ అన్న‌ట్టు క‌లిగించ‌నుంది అని సినిమా ఇండస్ట్రీ లో టాక్ బయలుదేరింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top