Chandrababu Teleconference: కూటమి 160కి పైగా సీట్లు సాధించి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలి!

Share the news
Chandrababu Teleconference: కూటమి 160కి పైగా సీట్లు సాధించి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలి!

Chandrababu Teleconference: రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే పొత్తు

వైసీపీ దుష్ట పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మరియు ఏపీ పునర్నిర్మాణం కోసమే టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న టీడీపీ బూత్ స్థాయి కార్యకర్తలు, నాయకులతో మంగళవారం రాత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ (Chandrababu Teleconference) నిర్వహించారు.

రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మూడు పార్టీల పొత్తు. వైసీపీ విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే పొత్తు. జగన్‌ ఓటమికే కాదు. రాష్ట్రాన్ని గెలిపించడం కోసం పొత్తు పెట్టుకున్నాం. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే 3 పార్టీలు చేతులు కలిపాయి. ఇక క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేయాలి. విభేదాలు పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు. ప్రతి సీటు ముఖ్యమే. వాడవాడలా మూడు జెండాలు కలిసి సాగాలి.

మళ్లీ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే కేంద్ర సహకారం అవసరం

See also  Varun Tej in Operation Valentine Promotions: పెద్దల మాటకి కట్టుబడి ఉంటా - వరుణ్ తేజ్ స్టేట్మెంట్ వైరల్!

పోలవరం, రాజధాని నిర్మాణానికి కేంద్ర సాయం ఎంతో అవసరం. పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సౌకర్యాలకు కేంద్ర సాయం అవసరం. కేంద్రంలో మనం భాగస్వామిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి న్యాయం జరిగింది…

వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలి

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 160కి పైగా సీట్లు సాధించాలి. జగన్ జనాన్ని నమ్ముకోలేదు.. పోలింగ్‌లో అక్రమాలనే నమ్మారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక వైసీపీ ఆగడాలు సాగవు. పార్టీ నేతలు, అభ్యర్థులు ప్రతి అంశాన్ని ఈసీ దృష్టికి తేవాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో(Chandrababu Teleconference) టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

-By Guduru Ramesh Sr. Journalist

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top