Telangana Vehicle Registration: తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ TS నుంచి TGకి.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్!

Share the news
Telangana Vehicle Registration: తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ TS నుంచి TGకి.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్!

Telangana Vehicle Registration Plates TS నుండి TG కి

వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్ లపై కాంగ్రెస్ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. రాష్ట్ర వాహనాల రిజిస్ట్రేషన్(Telangana Vehicle Registration) ప్లేట్లను TS నుండి TG కి మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకే వెహికల్ నెంబర్ ప్లేట్ల పై TS పేరును TGగా మార్చాలని నిర్ణయించడం తెలిసిందే. గత కేబినెట్ భేటీలో తెలంగాణ స్టేట్ (TS) బదులుగా తెలంగాణ గవర్నమెంట్ (TG) అని మార్చాలని నిర్ణయించారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం కోరినట్లుగానే రాష్ట్ర వాహనాల రిజిస్ట్రేషన్ (Telangana Vehicle Registration) కోడ్‌ను TS నుంచి TG మార్పు చేస్తూ కేంద్ర రవాణాశాఖ గెజిట్ నోటిఫికేషన్ మంగళవారం రాత్రి విడుదల చేసింది.

See also  Revanth Reddy meets Modi: CM హోదాలో తొలిసారిగా ప్రధాన మంత్రి మోడీని కలిసిన రేవంత్, వెంట Dy. CM భట్టి విక్రమార్క

ప్రస్తుతం ఉన్న TS నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని.. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకే నెంబర్ ప్లేట్లను ఇలా TG తో రిజిస్టర్ చేస్తారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సైతం ఇదే తరహాలో మార్పులు జరిగాయి. అప్పటివరకూ ఉన్న AP రిజిస్ట్రేషన్ల (AP Registration)ను యథావిధిగా కొనసాగిస్తూ కొత్త వాహనాలకు మాత్రమే TS కోడ్ తో రిజిస్ట్రేషన్ చేశారు.

ఇప్పటివరకూ TS పేరిట రిజిస్ట్రేషన్లు జరగగా.. ఇకనుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాల నెంబర్ ప్లేట్లపై TG గా మార్చనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ గైడ్ లైన్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వాహన రిజిస్ట్రేషన్లలో TS బదులు ఉద్యమ నినాదం అయిన TG ఉండాలన్నది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్న సంగతి తెలిసిందే.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top