Saindhav Movie Review: చిన్నోడి దారి లోనే పెద్దోడు

Saindhav Movie: తెలుగు సినిమా సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా తెరకెక్కిన సైంధవ్ మీద ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. హిట్ ఫ్రాంచైజీతో ఆకట్టుకున్న శైలేష్ కొలను రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలు ఏంటో చూద్దాం పదండి.
Share the news
Saindhav Movie Review: చిన్నోడి దారి లోనే పెద్దోడు

తారాగణం – వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆండ్రియా, రుహాని శర్మ, జిషు, ఆర్య మరియు ఇతరులు
బ్యానర్ – నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం – సంతోష్ నారాయణ్
ఛాయాగ్రహణం: మణికందన్
నిర్మాత – వెంకట్ బోయనపల్లి
దర్శకుడు – శైలేష్ కోనేరు

Saindhav Movie: కధ టూకీగా

సైంధవ్(వెంకటేష్) చంద్రప్రస్థ పోర్టులో క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తూ ఉంటాడు . కూతురు గాయత్రియే అతని ప్రపంచం. తన కూతురు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందని తెలుసుకున్న సైంధవ్ జీవితం ఛిన్నాభిన్నమౌతుంది. ఆ వ్యాధి నయం కావడానికి ఆమెకు 17 కోట్ల ఖరీదు చేసే ఒక ఇంజెక్షన్ కావాలి. ఇంతలో, ఓడరేవు వద్ద పెద్ద సంఖ్యలో ఆయుధాలు, డ్రగ్స్ మరియు నకిలీ కరెన్సీని తరలిస్తున్న కంటైనర్లు పట్టుబడుతాయి. ఈ ఆయుధాలు మరియు డ్రగ్స్‌తో పాటు టీనేజర్లను టెర్రరిజం కోసం రవాణా చేస్తున్న డాన్ వికాస్ మల్లిక్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ)కి చెందినవి. సైంధవ్, యువతపై ఇలాంటి నేరాలను ఆపుతానని హామీ ఇచ్చినందున, ఈ కంటైనర్లను దాచి పెడతాడు. బ్యాడ్డీ వికాస్ గ్యాంగ్‌లతో సైంధవ్ ఎలా పోరాడతాడు మరియు అతను తన కూతురిని ఎలా రక్షించుకుంటాడు అనేది కథ యొక్క సారాంశం.

See also  HanuMan BO Collections: హనుమాన్ కలెక్షన్ల కుంభవృష్టి..15 రోజుల్లో 250 కోట్ల గ్రాస్!

Saindhav Movie: విశ్లేషణ

Saindhav Movie దర్శకుడు శైలేష్ కొలను స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఆలోచన బాగుంది. కానీ అతను థ్రిల్లర్ భాగాన్ని పక్కన పెట్టి, తన మొత్తం శక్తిని స్టైలిష్ ప్రెజెంటేషన్‌లో ఉంచాడు. థ్రిల్లర్‌కి ట్విస్ట్‌లతో కూడిన బలమైన గ్రిప్పింగ్ కథ అవసరం. ఇది సైంధవ్‌లో లేదు. ఫలితం స్టైలిష్ ప్రెజెంటేషన్ వున్నా బలహీనమైన చిత్రంగా మారింది.

స్టోరీ ని సరిగా ఎస్టాబ్లిష్ చేయకుండా అనేక పాత్రలను చేర్చడం చిందరవందరగా మరియు అసంబద్ధమైన కథాంశానికి దోహదం చేసింది . సింగిల్ పేరెంట్ తన కుమార్తె అరుదైన వ్యాధి కోసం పోరాడుతూ, మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో దీన్ని లింక్ చేయడం బ్యాలెన్స్ చేయడం సవాలుగా మారింది. ఇక్కడే దర్శకుడు కూడా విఫలమయ్యాడు. ప్రారంభ భాగాలు స్లో పేస్‌లో వున్నా, సగానికి వచ్చేసరికి సినిమా ఊపందుకుంది. కొంచెం ఆసక్తిని కలిగించింది.సైంధవ్‌లోని మెయిన్ కాన్సెప్ట్ తండ్రీకూతుళ్ల భావోద్వేగం. ఇది సెకండాఫ్‌లో అవుట్ అఫ్ ట్రాక్‌లోకి వెళ్లిపోతుంది. సెకండ్ హాఫ్ మొత్తం సైంధవ్ మరియు వికాస్ మల్లిక్ మధ్య జరిగే యుద్ధం

See also  RC 17: రామ్‌చ‌ర‌ణ్ బర్త్ డే సర్ప్రైజ్ ముందే వచ్చేసింది.. చరణ్, సుకుమార్ సినిమా అనౌన్స్ చేసిన మైత్రి!

ఇక హీరో పాత్రకు అవసరమైన బిల్డప్.. ఎస్టాబ్లిష్మెంట్ సరిగా జరగలేదు. దీనికి తోడు నవాజుద్దీన్ సిద్ధిఖి లాంటి విలక్షణ నటుడు ఉన్నా కూడా.. విలన్ పాత్రలో ఎలాంటి ప్రత్యేకత కనిపించదు. విలన్ పాత్ర బలంగా లేనప్పుడు హీరో ఎంత యాక్షన్ విన్యాసాలు చేసిన.. కోరుకున్నంత కిక్ రాదు. ఇదే సైంధవ్ సినిమాకు అతి పెద్ద సమస్యగా నిలిచింది. శై లేష్ (Sailesh) చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ సిటీనైతే క్రియేట్ చేశాడు కానీ అందులో వావ్ అనిపించేలా ఏదీ చూపించలేకపోయాడు.

మైనస్ లు పక్కన పెడితే.. Saindhav Movie ను డ్రైవ్ చేసింది వెంకటేష్(Venkatesh) పెర్ఫార్మెన్స్.. ఆయన చేసిన యాక్షన్ ఘట్టాలు. యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. అయితే ఈ యాక్షన్ సన్నివేశాలకు అవసరమైన బిల్డప్ మాత్రం అన్నిచోట్ల కుదరలేదు. ఎగుడుదిగుడుగా సాగే ప్రథమార్ధం.. కొంచెం మెరుగ్గా ద్వితీయార్థం. విలన్ పాత్రకు సరైన ఎలివేషన్ ఇచ్చి ఉంటే చివరికి సైంధవ్ మంచి స్థాయిలో నిలబడేది. కానీ ఆ పాత్రను తేల్చి పడేయడం నిరాశ కలిగిస్తుంది. దర్శకుడు పాప పాత్రకు ప్రేక్షకులు ఊహించిన దానికి భిన్నమైన ముగింపు ఇచ్చాడు. ఇది వైవిధ్యంగా అనిపించినా.. అంత మంచి ఫీలింగ్ అయితే ఇవ్వదు. ఇక క్లైమాక్స్ ఒక మోస్తరుగా అనిపిస్తుంది. హీరో గతం తెలుసుకోవాలని చాలా సేపు ఎదురు చూస్తాం కానీ.. సీక్వెల్ వచ్చేవరకు ఆగాలని చావు కబురు చల్లగా చెప్పాడు దర్శకుడు. సైంధవ్ చూశాక హీరో గతం తెలుసుకోవాలన్న ఆసక్తి పుడుతుందా అన్నది సందేహమే.

See also  Prabhas The Raja Saab: ప్రభాస్ - మారుతి సినిమా ‘ది రాజా సాబ్’ ఫస్ట్‌లుక్!

ఇక చివరిగా,

OTT ల వల్ల ప్రేక్షుకుల అభిరుచి లో చాలా మార్పు వచ్చింది. దర్శకులు నేలవిడిచి సాము చేయకుండా కధకు తగట్టు పాత్రలు ఉండేలా చూసుకోవాలి. పెద్ద హీరో వున్నాడని అనవసర బిల్డ్ అప్ కు వెళ్ళ కూడదు. తెలుగు రాజకీయాలను తీసుకున్నా బోలెడు కధలు రాసుకోవచ్చు. ఇక పోతే సంక్రాంతి సీజన్ కాబట్టి ఈ మూడు రోజులు కలెక్షన్స్ బాగేనే ఉండవచ్చు. ఆ తరువాత కష్టమే Saindhav Movie కి..

Also Read News

Scroll to Top